KTR vs Revanth : నువ్వెందుకు ప్రధానిని కలవడం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

KTR vs Revanth : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీని మీట్ కాలేదు. ప్రధానితో మీటింగ్స్‌ను క్యాన్సిల్ చేసేవారు. దానికి కారణం.. తెలంగాణకు ప్రధాని మోదీ చేసిన, చేస్తున్న అన్యాయం. దాన్ని కాంగ్రెస్ పార్టీ రచ్చ రచ్చ చేసింది. కావాలని మమ్మల్ని ఇరికించేందుకు మేమేదో కుట్ర చేస్తున్నామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆరోపించింది.

Advertisement

ktr questions revanth reddy for boycotting niti ayog meeting

Advertisement

కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి తానే స్వయంగా నీతి ఆయోగ్ మీటింగ్‌కి హాజరు కావడం లేదు. దాన్ని బైకాట్ చేశారు. మరి.. నువ్వెందుకు ప్రధాని మోదీతో మీటింగ్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నావు. మోదీని ఎందుకు కలవడం లేదు.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వాళ్లు చేసిన అన్యాయంపై ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.

అలాగే.. పంటలసాగు కోసం అసలు నీటిని ఇచ్చే పరిస్థితి లేదని.. గతంలో నీటి సమస్య లేకున్నా నీటి సమస్య ఉందని అసత్య ప్రచారం చేస్తూ పంటలసాగుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలంతా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం రేవంత్ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణలో కరువు పదం వినపడకూడదనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు.

Author