Sravana Sanivaram : శ్రావణమాసంలో మహిళలు ఈ విధంగా చేస్తే సర్వ దోషాలు పోయినట్లే…!!

Sravana Sanivaram : శ్రావణమాసంలో వచ్చే శనివారం నాడు మహిళలు ఈ పని చేసినట్లయితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఈ ఒక్క పనితో సిరిసంపదలు వర్షిస్తాయి. మహిళలు శ్రావణమాసంలో వచ్చే శనివారం రోజు ఏం చేస్తే దరిద్రమంత పోయి ధన ప్రాప్తి కలుగుతుంది…?ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం… తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణం. ఇది ఎంతో పవిత్రమైన మాసం. సనాతన ధర్మ ప్రకారం మనకి ఉన్న 12 మాసాలలో ఐదవది ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం శ్రావణ నక్షత్రం వలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట రక్షకుడు శిక్ష రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవి అయిన మహాలక్ష్మికి అత్యంత ప్రీతి కరణమైన మాసంగా శ్రావణమాసం చెప్పుకుంటారు. అసలు శ్రావణమాసం ఎందుకు ప్రీతికరమంటే విష్ణు నక్షత్రం శ్రవణం కాబట్టి శ్రావణమాసం అని అంటారని పెద్దలు చెబుతారు.

Advertisement

ఇక ఈ మాసంలో మంగళ గౌరీ శ్రావణ శుక్రవారం గోకులాష్టమి ఇటువంటి పుణ్య విశేషమైన పండగలు వస్తాయి. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకి ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పులను పూజించడం సర్వ సర్వసుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడం కుదరకపోయినా ఒక్క శనివారం రోజు అయిన ఈ పూజా విధానాన్ని ఆచరించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన దేవాలయంలో ప్రదక్షిణలు పిండితో చేసిన దీపాలతో ఆరాధన గో సేవ చేస్తే తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement

శ్రావణ శనివారం రుద్రాయ దేవతల ఆరాధన చాలా మంచిది. అపమృత్యు నుండి తప్పించుకోవాలి అనుకునేవారు ఆ రోజు నువ్వుల నూనెతో హోమం చేసి నువ్వులను దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శని దోష పూజారి కార్యక్రమాలు కూడా చేయవచ్చు. శ్రావణ శనివారం నాడు గౌరీదేవిని పసుపు కుంకుమలతో ఎవరైతే పూజిస్తారో వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోజు అమ్మవారికి ఇష్టమైన పరవాన్ననీ వండి నైవేద్యంగా పెట్టాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమలతో తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిది. దానితో పాటు అమ్మవారికి పెట్టిన పరమాన్నాన్ని పంచి పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్రం అంత పోయి లక్ష్మీదేవి కరుణిస్తుంది. శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బోజస్తంభం వద్ద నేతితో దీపాన్ని వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇక ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతుని పూజిస్తే ఇంటి బాధలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.

Author