Chanakyaniti : ఆచార్య చాణక్యుడు సమాజం పట్ల లోతైన అవగాహన ఉంది. కాబట్టి అతను రచించిన గ్రంథాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో అతను చెప్పిన వాటిని అనుసరించిన వారు ఎంతో సంతోషంగా విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. చ చాణక్య విధానాలు నేటి కాలంలో కూడా ఎంతో అనుసరణీయం అని కూడా చెప్పాలి. తన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కోనవసరం లేదని నమ్ముతారు. మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే వారి బాహ్య సౌందర్యాన్ని చూడకూడదు. అంతర్గత లక్షణాలను కూడా చూడాలని చాణిక్యుడు తన నీతి గ్రంథాల్లో పేర్కొన్నాడు. ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు. ఈ లక్షణాలు ఉన్నవారు. జీవిత భాగస్వామిగా వస్తే అతను చాలా అదృష్టవంతుడు అని చానక్యుడు చెప్పాడు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే భక్తులకు అదృష్టం వస్తుంది…
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక పురుషుడు స్త్రీ స్వభావం విధిని అరచేతి రేఖల ఆధారంగా కాకుండా శరీర లక్షణాల ఆధారంగా చెప్పవచ్చు.. అదేవిధంగా భర్తకు అదృష్టాన్ని ప్రసాదించే అమ్మాయిల శారీరిక మానసిక లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వేదాలపై జ్ఞానం ఉన్నటువంటి జీవిత భాగస్వామి లభిస్తే అతను నిజంగా అదృష్టవంతుడు. అంతేకాదు వాటిపై పట్టు ఉన్న మహిళలను చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారికి సత్యమేంటో అసత్యం ఏంటో తెలిసి ఉంటుంది. అలాంటి స్త్రీలు ఎల్లప్పుడూ కుటుంబ విలువలను పెంచుతారు. అలాగే ఆమెను పెళ్లాడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఆర్థికంగా సంపన్నుడిగా ఉంటాడు.
Chanakyaniti : ఎలాంటి స్త్రీ అంటే ?
మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ ఇలాంటి స్త్రీల ప్రసంగం చాలా మధురంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా సంతోషంగా ఉంటారు. అదే సమయంలో ఆమె తన వినయ స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. అలాంటి స్త్రీలు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతారు. అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. డబ్బును ఆదా చేయడం సంపదను కూడబెట్టడంలో నైపుణ్యం కలిగిన స్త్రీలు కష్ట సమయాల్లో భర్తకు సహాయం చేస్తుంటారు. ఎందుకంటే కష్ట సమయాల్లో తాను జమ చేసిన డబ్బుతో భర్తకు సహాయపడుతుంటారు. అందుకే స్త్రీ సంపద కుటుంబానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
అమ్మాయి కాలి బొటన వేలు గుండ్రంగా ఏర్పుగా ముందు ఉండి పైకి లేపబడి ఉంటుంది. అలాంటి అమ్మాయిలు వివాహం తర్వాత వారి భర్త అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తారు. ఈ అమ్మాయిలా అదృష్టం వారి భర్తలకు కూడా లభిస్తుంది. అతని జీవితంలో పురోగతి సాధించగలరు. ఇంటి పెద్దలను గౌరవించే చిన్నవారిని ప్రేమించే స్త్రీని వివాహం చేసుకుంటే అదృష్టం ఇలాంటి మహిళ వల్ల ఇంట్లో ఆనందాలు సిరులు ఎల్లప్పుడూ తాండవిస్తాయి. ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీలు పరిష్కరించగలరు. ఎలా నిర్వహించాలో తెలిసిన మహిళ కుటుంబాన్ని చాలా చక్కగా నిర్వహించగలరు. అలాంటి వారు దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఏలాంటి అడ్డంకులకు కృంగిపోకుండా ఎలా బలంగా నిలబడాలో తెలిసిన స్త్రీలు జీవితంలోకి వస్తే పురుషులు చాలా అదృష్టవంతులు అవుతారు…
చాలా స్వీయ క్రమశిక్షణ కలిగిన స్త్రీ ఇతరుల పట్ల శ్రద్ధ చూపుతూ తన సమయాన్ని చక్కగా నిర్వహించగలరు. అలాంటి లక్షణం ఉన్న అమ్మాయిని మీ జీవితంలోకి ఆహ్వానించాలి. తన తీర్పులో పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా చూసే మహిళలు చాలా అరదు అని చెప్పాలి. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి జీవితంలోకి వస్తే అసలు వదులుకోకూడదు.. కాళ్లపై శంఖం కమలం లేదా చక్రాల గుర్తులు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. అలాంటి స్త్రీలు సాధారణంగా ఉన్నత స్థానంలో ఉంటారు. లేదా సహచరుని కలిగి ఉంటారు. ఈ లక్షణాలను చాలా అదృష్టవంతులని ఇలాంటి లక్షణాలున్న వారు తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచుతారని స్పష్టం చేశాడు ఆచార్య చానుక్యుడు…