Health Benefits : గోంగూర తినడం వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం…మరెన్నో లాభాలు…!!

Health Benefits : గోంగూర తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గోంగూరలో విటమిన్ సి, ఎ, బి 1, బి2 , బి 9, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఫాస్పరస్, పొటాషియం, రైబోఫ్లేవిన్ , కెరోటిన్‌లు ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా మనిషి కావాల్సిన విటమిన్ సి గోంగూరలో 53% లభిస్తుంది. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే వారానికి రెండు సార్లు గోంగూరని తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గోంగూర తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో..? ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గోంగూర పూల పొడిని అరకప్పు తీసుకొని దానితో రసం చెయ్యాలి. దీనిని వడగట్టిన తర్వాత ఇందులో అరకప్పు వరకు పాలను కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగితే కళ్లకు మంచిది . అలాగే గోంగూర ఆకుని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. దీనిని తలకు పట్టించి అరగంట సేపు తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం చుండ్రు అంటే సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా నిలవలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా గోంగూరలో ఉండే మెగ్నీషియం పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గోంగూరని వారంలో రెండు మూడుసార్లు తీసుకోవడం ద్వారా హైబీపీని పూర్తిగా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే దగ్గు తుమ్ములతో బాధపడేవారు ఈ గోంగూర తీసుకోవడం వలన త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

గోంగూరలో క్లోరోఫిల్స్ ఉండడం వలన ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే గోంగూర కూర తినడం ఇష్టం లేనివారు పులిహార చేసుకొని కూడా తినవచ్చు. అంతేకాకుండా గోంగూర నుంచి తీసిన జిగురుని నీటిలో కలుపుకొని తాగితే విరోచనాలు సమస్య తగ్గుముఖం పడుతుంది. చాలామంది మహిళలకి పిరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి నీరసంగా కాలు లాగడం చేతులు లాగడం వంటివి ఉంటాయి. ఈ సమయంలో వారు గోంగూర తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే ఎముకలను దృఢంగా ఉంచుతుంది మరియు విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేస్తుంది.

Author