Business : వేసవికాలం అదిరిపోయే బిజినెస్ ఐడియా… ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదన…!

Business  : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటున్నారు. మరి ముఖ్యంగా నేటి యువత ఆలోచన విధానం కూడా ఈ విధంగానే ఉంది. దీంతో పట్టణంలో ఉద్యోగాలు చేసేవారు సైతం తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ నష్టాలు లేకుండా లాభాలు వచ్చేలా వ్యాపారాలు చేసేందుకు ముగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే ఉద్యోగంలో ఎంత జీతం వచ్చిన సరే ఒకరి కింద బానిస లాగానే పని చేయాలి. కాని స్వయం ఉపాధి పొందుతూ మరి కొంతమందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే చాలామంది ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఓ రిస్క్ లేని బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలో ఉద్యోగం చేస్తూ చాలీచాలని జీతంతో సతమతమవుతున్న వారికోసం మేము ఒక బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాం. పైగా దీనిని మీ సొంత ఊర్లో కూడా ప్రారంభించవచ్చు. అంతేకాక ఈ బిజినెస్ అనేది వేసవికాలంలో మరింత ఎక్కువగా సాగుతుంది కాబట్టి ఈ సమయంలో ప్రారంభించండం మంచిది. ఇక ఆ బిజినెస్ మరేంటో కాదు వాటర్ ప్లాంట్ బిజినెస్.

అయితే ప్రస్తుతం వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది నగరం , గ్రామం తో సంబంధం లేకుండా విపరీతంగా సాగుతుంది. చాలామంది ఈ వ్యాపారాన్ని ఎంచుకుని 25 లీటర్ల వాటర్ టిన్ లతో లక్షలు వ్యాపారం చేస్తున్నారు. అంతేకాక వాటర్ ప్యాకెట్లు లీటర్ వాటర్ బాటిల్స్ ని కూడా విక్రయిస్తూ అధిక మొత్తంలో సంపాదిస్తున్నారు.

Business : వేసవికాలం అదిరిపోయే బిజినెస్ ఐడియా.... ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదన...!
Business : వేసవికాలం అదిరిపోయే బిజినెస్ ఐడియా…. ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదన…!

Business : ఎలా ప్రారంభించాలంటే..

అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మీ యొక్క పాన్ నెంబర్ జిఎస్టి నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది. అలాగే స్థానిక అధికారుల నుండి ఈ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఈ వ్యాపారంలో వాటర్ ప్యూరిఫైయర్ చేసేందుకు ఆర్ఓ ఫిల్టర్లతో పాటు మరి కొన్ని మిషన్స్ అవసరం అవుతాయి. వాటన్నింటిని మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఇంటి వద్ద ఓ 1500 చదరపు గజాల స్థలం ఉంటే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లేదా పట్టణాల్లో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే దానికోసం మీరు షాప్ ను లీజ్ కి తీసుకోవాలి.

Business  పెట్టుబడి ఎంత…

ఇక ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి పరికరాలతో దాదాపు మీకు 2.5 లక్షలు వరకు ఖర్చవుతుంది. ఒకవేళ మీరు షాప్ లీజ్ తీసుకున్నట్లయితే 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఆదాయం విషయానికొస్తే ప్రస్తుతం ఒక మినరల్ వాటర్ బాటిల్ ద్వారా 20 రూపాయలు ఉంది. కావున మీరు ప్రతిరోజు 400 వాటర్ క్యాన్లు సప్లై చేయగలిగితే దాదాపు పదివేల వరకు వస్తాయి. ఈ విధంగా మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది