Viral Video : సాధారణంగా స్టూడెంట్స్ కు హోం వర్క్ రాయాలంటే తెగ చిరాకు పడతారు. అబ్బా.. ఏంటి ఈ హోం వర్క్ ఎవడు చేస్తాడు? రోజూ రాయాలంటే చిరాకు అని అనుకుంటారు. పేజీలకు పేజీలు రోజూ రాసి రాసి విద్యార్థుల చేతులు నొప్పి పుడతాయి కానీ టీచర్లు మాత్రం కనికరించరు. కానీ.. రోజులు మారాయి బాస్. టెక్నాలజీ మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే ఓ విద్యార్థి.. టెక్నాలజీని ఉపయోగించుకొని తన స్కూల్ హోంవర్క్ చేయడానికి ఏకంగా ఒక మెషిన్ నే తయారు చేశాడు.
అవును.. అచ్చం తన చేతి రాతలా ఉండేలా చాట్ జీపీటీ ఏఐ సాయం తీసుకొని మరీ ఆ మెషిన్ కు సంకేతాలు ఇచ్చి తన హోం వర్క్ మొత్తం రాసేలా చేతి రాత మెషినే రాసేలా చేశాడు. ఇంకేముంది క్షణాల్లో ఆ మెషిన్ హాండ్ రైటింగ్ రాయడం చూసి ప్రస్తుతం జనాలంతా ఆశ్చర్యపోతున్నారు.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ వీడియోను మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు. కొందరు ఆ వీడియోను చూసి అవాక్కవుతున్నారు.
A student in India designed a machine which uses AI to write his homework in his own handwriting. pic.twitter.com/rkTyyoJMmH
— Shubham2.0 (@bhav_paaji) July 21, 2024