Mysterious Temples : మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ప్రజలు తమకు ఇష్టమైన దేవుని కొలవడానికి లేదా మానసిక ప్రశాంత కోసమో, ఆధ్యాత్మిక అనుభూతి కోసమో గుడికి వెళుతూ ఉంటారు. అయితే దేశం లో ఉన్న ప్రతి గుడి ఒకేలాగా అయితే ఉండవు. వాటి స్థల పురాణం అలాగే గుడిలో ఉండే విచిత్రమైన ఆచారాలు, ఎవరికీ తెలియని రహస్యాలు ఇవన్నీ ఇప్పటికీ కొన్నిచోట్ల అంతు చిక్కని మిస్టరీ లాగానే మిగిలిపోయాయి.అలాంటి 10 మిస్టీరియల్స్ గుడుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం….
Mysterious Temples : 1.కొడంగూర్ భగవతి ఆలయం కేరళ.
సాధారణంగా ఏ దేవుడు గుడికి వెళ్ళిన కొబ్బరికాయలు కొట్టడం పూజలు చేయడం సహజం. కానీ ఈ గుడిలో మాత్రం దేవుడి మీద రాళ్లు విసురుతారు.అలాగే తిట్ల దండకం కూడా మొదలు పెడతారు.ఈ గుడిలో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఆచారం ఇది. దీనికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటికే తెలియదు.
Mysterious Temples : 2.స్తంభేశ్వర మందిరం గుజరాత్.
సాధారణంగా ఏ గుడి అయినా సరే నేల మీద లేదా గుట్టమీద ఉంటాయి. కానీ ఈ టెంపుల్ మాత్రం ప్రత్యేకంగా నీళ్లలో ఉంటుంది.ఇక విచిత్రం ఏమిటంటే ఈ గుడి అప్పుడప్పుడు కనిపించి కుండా మాయమైపోతూ ఉంటుందట.దాని వెనక గల కారణమేంటనేది ఎవరికీ తెలియదు.
Mysterious Temples : 3.బ్రహ్మ దేవాలయం రాజస్థాన్.
హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒక్కడైనా బ్రహ్మ ని పూజించకూడదు అనే శాపం ఉంది.అందుకనే ఆయనకి ఎక్కడ కూడా గుడి కట్టలేదు. కాని ఆయనకు ప్రత్యేకంగా ఒకే ఒక గుడి మాత్రమే ఉంది. అదే రాజస్థాన్ లోని బ్రహ్మ దేవాలయం.
Mysterious Temples : 4.కాల భైరవంత్ ఆలయం వారణాసి.
గుడిలో ప్రసాదంగా లడ్డును పులిహోర పెడతారు కానీ ఈ ఆలయంలో ఆల్కహాల్ ని ప్రసాదంగా ఇస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో శివుని ప్రతిరూపమైన కాలభైరవణ ఆలయంలోఈ ప్రత్యేకత కనిపిస్తుంది.
Mysterious Temples : 5.నిధి వన్ ఆలయం ఉత్తర ప్రదేశ్.
నిధి వన్ రంగ మాల్ టెంపుల్ కి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని రాసలీలు ఆడుతారు అని స్థానికులు అంటారు. అందుకే సూర్యస్తమం జరిగిన తర్వాత ఈ టెంపుల్ ని మూసి వేస్తారు.
Mysterious Temples : 6.మెహందీపూర్ బాలాజీ ఆలయం రాజస్థాన్.
దెయ్యాలు పిచాచిలు వదలాలి అంటే ఈ ఆలయానికి వెళ్లాలి అని రాజస్థాన్ ప్రజల నమ్మకం.అయితే ఈ టెంపుల్ కి వేల సంఖ్యలోప్రజలు వస్తారు. అయితే వీళ్ళ భక్తి విచిత్రంగా ఉంటుంది. వేడి నీటిని శరీరంపై పోసుకోవడం. ఉరి వేసుకున్నట్టు వేలాడడం. కొంతమంది అయితే గొలుసులకు కట్టేసుకుని తలని గోడకి కొట్టుకోవడం వంటి విచిత్రమైనవి ఇక్కడ ఉంటాయి.
7.బుద్ధ నీలకంట ఆలయం నేపాల్.
మహావిష్ణువు వెలసిన ఆలయం బుద్ధ నీలకంట. బుద్ధ నీలకంట అంటే నీలపు రంగు విగ్రహం అని అర్థం వస్తుంది.ఈ విగ్రహం ఉన్న ఆలయం నేపాల్ లో ఉంది. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు ఆదిశేషుల సైన మూర్తిగా దర్శనం ఇస్తాడు.
8. జ్వాలాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్.
సాధారణంగా ఏ గుడిలో అయినా దేవతని లేదా దేవుడు విగ్రహాలను పూజిస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం నిరంతరం వెలుగుతున్న ఒక జ్వాలని దేవతగా కొలుస్తారు.హిమాచల్ ప్రదేశ్ లోని కంగనా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి దేవి ఆలయం ఇది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలో ఉన్న జ్వాల కొన్ని వందల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది.
9.లింగరాజ దేవాలయం ఒడిస్సా.
హిందువులు ఎక్కువ విశ్వాసంతో పూజలు చేసే ఆలయం ఇది. ఇక్కడ హరిహరలు ఇద్దరు పూజించబడతారు.ఒడిస్సా లోని భువనేశ్వర్ పురం లో ఉన్న అతిపెద్ద దేవాలయమే ఈ లింగరాజు దేవాలయం.ఈ దేవాలయం క్రీస్తుపూర్వం 1014 నాటిదని చరిత్ర చెబుతుంది.
10. వైష్ణవ దేవి ఆలయం జమ్మూ కాశ్మీర్.
హిందువులు అష్టాదశ శక్తి పీఠాలను పవిత్రమైన ప్రదేశాలుగా భావించి కొలుస్తారు. అలాంటి శక్తి పీఠాల కంటే కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఈ వైష్ణవి దేవి ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలు అంటే కేవలం సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు మాత్రమే అవుతాయి.