Health Tips : ఈ సమస్యలు ఉన్నవారికి ఈ పండు ఒక దివ్య ఔషధం… దీన్ని మించినది మరొకటి లేదు…!!

Health Tips : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. రక్తంలోని చక్కేర స్థాయిలను సహజంగా తగ్గించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలలో ఒకటి పండ్లు తినటం. కొన్ని పండ్లను తినటం వలన సహజంగా మీ శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి వాటిలలో అవకాడో ఒకటి. దీనిని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండు మన శరీరానికి చాలా పోషకాలను అందిస్తుంది..

Advertisement

అవకాడో లో కూరగాయల మాదిరిగానే ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నాయి. దీనిలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది మీ శరీరాన్ని ఎక్కువ కొవ్వు నుండి రక్షణ ఇస్తుంది. మీ శరీరం ఫొలిక్ యాసిడ్ లాంటి విటమిన్లను ఉత్పత్తి చేయటంలో ఎంతో మేలు చేస్తుంది. కావున మీరు ఈ పండును పచ్చిగా కూడా తీసుకోవచ్చు. అవకాడో మీ శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేందుకు కూడా సహాయం చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచేందుకు సహాయం చేస్తుంది…

Advertisement
Advertisement

ఈ అవకాడో ను ప్రతిరోజు తీసుకోవడం వలన స్ట్రోక్ లేదా గుండెకు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. అవకాడోలో ఉండే కొవ్వు ఆమ్లాలు లైపెస్ ఎంజెమ్ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. అవకాడోలో విటమిన్ బి, విటమిన్ కె,విటమిన్ ఇ, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి. అవకాడో లో ఉండే పొటాషియం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో సహాయం చేస్తుంది. మీ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అవకాడోలో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది…

Author