Telangana : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల టైమింగ్స్ ను మార్చుతూ తెలంగాణ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైమరీ స్కూల్స్ టైమింగ్స్ కు అనుగుణంగా హైస్కూల్ టైమింగ్స్ ను కూడా మార్చినట్టు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. హైస్కూల్(ఉన్నత పాఠశాలల) సమయాలను ఉదయం 9 గంటలకే మార్చింది.
ప్రస్తుతం ఉన్నత పాఠశాలల సమయం ఉదయం 9.30 కి ఉండేది. కానీ.. ఆ సమయాన్ని కుదించి ఉదయం 9 గంటలకే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే.. సాయంత్రం 4.45 కి ప్రస్తుతం పాఠశాల ముగుస్తుంది. కానీ.. ఉదయం 9 గంటలకే పాఠశాల ప్రారంభం అవుతుండటంతో సాయంత్రం 4.15 కే ఇక నుంచి ముగియనుంది.
అలాగే.. హైదరాబాద్ నగరంలో ఉదయం, సాయంత్రం పూట ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఉదయం 8.45 కే రాజధానిలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు స్కూల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన విధివిధానాల ప్రకారం స్కూల్స్ నడుచుకోవాలని, తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్కూల్స్ టైమింగ్స్ ను మార్చాలని విద్యాశాఖ అన్న స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.