khammam : ప్రాణాలు నిలబెట్టాల్సిన వైద్యులే నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఘటనలు ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు మానవత్వం మంటగలిసేలా వికృత పనులు చేస్తూ వైద్యులు సిగ్గుపడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఖమ్మం జిల్లాలో మూడు రోజుల్లోనే దాదాపు నాలుగు ఆస్పిటల్ సీజ్ అవడం జరిగింది. దీంతో ఖమ్మం జిల్లాలో కొందరు ప్రైవేటు వైద్యులు చేస్తున్న దందా ఏ స్థాయిలో జరుగుతుందనే విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటి వారి వలన విలువలతో కూడిన వైద్యం చేస్తున్న డాక్టర్లు సైతం మానసికంగా కుంగిపోతున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ మరింత బాధాకరమైన విషయం ఏంటంటే సంతాల సాఫల్య కేంద్రం బోర్డులు పెట్టి కడుపులో పెరిగే పసి కందులను చిదిమేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో విస్తృతంగా మితిమీరిపోయిన ఈ దందాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం దీనిని గుర్తించలేని స్థితిలో ఉన్నట్లుగా సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబార్షన్లకు పాల్పడే హాస్పటల్ ను రద్దు చేయాల్సిందిగా ఐఎంఐ పెద్దలు ప్రకటించారు. చట్ట ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న హాస్పిటల్ పై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఘటనలను సహించేది లేదని తెలియజేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే…
khammam ఖమ్మం జిల్లా సంతాన సాఫల్య కేంద్రం అంటూ బోర్డు పెట్టి లోపల మాత్రం
ఖమ్మం జిల్లాలో అబార్షన్లు నిర్వహించే హాస్పటల్ సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అబార్షన్ల వ్యాపారాన్ని ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు ఖమ్మం కేంద్రంగా ఈ అనుషితమైన ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దందాకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే పేరుకు బయట సంతాన సాఫల్య కేంద్రం అంటూ బోర్డు పెట్టి లోపల మాత్రం చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ దందా ఎంతలా సాగుతుందంటే రోజుకు కనీసం 5 నుండి 6 అబార్షన్లు ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు జిల్లా వైద్యుత్ ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రింద మూడు హాస్పిటల్లను సీజ్ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే డి.ఎం.హెచ్.వో డాక్టర్ మాలతి…డిప్యూటీ డి.ఎం.హెచ్.వో డాక్టర్ సైదులు కు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల ఖమ్మం నడిబొడ్డున చర్చి కాంపౌండ్ సమీపంలోని సుగుణ హాస్పిటల్ పై దాడి చేశారు. ఇక ఈ హాస్పిటల్ లో ఇద్దరు నెలలు నిండని గర్భిణీలకు అబార్షన్లు చేస్తున్న క్రమంలో వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఆ ఇద్దరి మహిళలకు అప్పటికే ఇంజక్షన్లు ఇచ్చి అబార్షన్ కు సిద్ధం చేయగా అదే సమయంలో పోలీస్ శాఖ వైద్యారోగ్య శాఖ దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
డి.ఎం.హెచ్.వో డాక్టర్ మాలతి మరియు డిప్యూటీ డి.ఎం.హెచ్.వో డాక్టర్ సైదులు తెలిపిన సమాచారం ప్రకారం…బోనకల్ క్రాస్ రోడ్డు సమీపంలోని చర్చి కాంపౌండ్ కు వెళ్లే ప్రధానం రహదారిలో సుగుణ హాస్పిటల్ ఉంది. ఇక ఈ హాస్పిటల్లో ఇద్దరు నెలలు నిండని మహిళలకు అబార్షన్ చేస్తుండగా అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ యువరాజ్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి మౌనిక సంయుక్తంగా హాస్పిటల్ పై దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా నిర్వాహకులను పట్టుకున్నారు. ఇక ఆ ఇద్దరు మహిళలు కూడా వేరే ప్రాంతానికి చెందిన వారని డాక్టర్ మాలతి తెలియజేశారు. ఇక వీరిద్దరూ కూడా 18 వారాలు , రెండు నెలలు నిండిన వారేనని అంతేకాక హాస్పిటల్ సిబ్బంది వద్ద నెలలు నిండని 50 మంది మహిళలల కేసుల లీస్ట్ లభించినట్లుగా వారు తెలిపారు.
ఇక అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన వారి వివరాలను మాత్రం ఐపి , ఓపి లో నమోదు చేయలేదని తెలియజేశారు. అంతేకాక ప్రతి కేసు పై కోడు నమోదు చేసిందని తెలిపారు. మరి ఆ కోడ్ ఏంటని అధికారులను నిలదీస్తే చెప్పడం లేదని తెలియజేశారు. ఇక అబార్షన్ కు వచ్చిన మహిళలు వాంతులు మరియు కడుపునొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. దీంతో స్కానింగ్ మిషన్ , రికార్డ్స్ ,కంప్యూటర్లను హాస్పిటల్స్ ను సీజ్ చేసినట్లుగా వారు తెలిపారు . అలాగే అబార్షన్ కు సిద్ధమైన ఇరువురి మహిళలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పారు. ఇక ఈ తనిఖీలు డిప్యూటీ సైదులు మరియు వన్ టౌన్ పోలీసులు సైతం పాల్గొన్నారు.