Maharshi Raghava : చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో 100 సార్లు ర‌క్త‌దానం చేసిన మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. సన్మానించిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఒక న‌టుడిగానే కాదు మంచి మ‌నిషిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆయ‌న సంపాదించిన మొత్తంలో కొంత సామాజిక కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తున్నాడు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి అండ‌గా నిలిచారు. ఇక క‌రోనా స‌మ‌యంలో చిరు ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కి పెద్ద చ‌రిత్ర ఉంది. 1998 అక్టోబర్ 2వ తేదిన స్టార్ట్ అయిన ఈ బ్ల‌డ్ బ్యాంక్ 26 ఏళ్లుగా లక్షలాది మంది ప్రాణాల‌ని నిలబెట్టింది. వంద‌లాది మెగాభిమానులే కాకుండా ప్రజలు అందిస్తున్న అండదండలతో ఈ బ్ల‌డ్ బ్యాంక్ సక్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది.

Maharshi Raghava : చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో 100 సార్లు ర‌క్త‌దానం చేసిన మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. సన్మానించిన మెగాస్టార్
Maharshi Raghava : చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో 100 సార్లు ర‌క్త‌దానం చేసిన మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. సన్మానించిన మెగాస్టార్

Maharshi Raghava : ప్ర‌ప్ర‌థ‌ముడు మ‌హ‌ర్షి..

అయితే ఈ బ్లడ్ బ్యాంక్‌కి నిత్యం బ్లడ్ డోనెట్ చేస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ ఒక‌రు కాగా, ఈ బ్ల‌డ్ బ్యాంక్ స్టార్ట్ అయిన‌ప్పుడు ర‌క్త‌దానం చేసిన తొలి వ్య‌క్తి ముర‌ళీ మోహ‌న్‌..ఆయ‌న త‌ర్వాత మ‌హ‌ర్షి రాఘ‌వ బ్ల‌డ్ డొనేట్ చేశారు. ఆయ‌న ఇప్పుడు వందో సారి బ్ల‌డ్ డొనేట్ చేశాడు. ఇది గొప్ప రికార్డ్. అయితే 100వ సారి ర‌క్త‌దానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.అయితే వందో సారి మ‌హ‌ర్షి రాఘ‌వ ర‌క్త‌దానం చేసే స‌మ‌యంలో చిరంజీవి చెన్నై లో ఉన్నారు. అయినా సరే తన మాటని నిలబెట్టుకున్నారు చిరు.

Maharshi Raghava : చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో 100 సార్లు ర‌క్త‌దానం చేసిన మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. సన్మానించిన మెగాస్టార్
Maharshi Raghava : చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో 100 సార్లు ర‌క్త‌దానం చేసిన మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. సన్మానించిన మెగాస్టార్

హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత మ‌హ‌ర్షి రాఘ‌వ‌ను ప్ర‌త్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు చిరంజీవి. ఆయ‌న‌తో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన ముర‌ళీ మోహ‌న్‌ను కూడా చిరంజీవి ఆహ్వానించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇక మ‌హ‌ర్షి రాఘ‌వ స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి కూడా స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 3 నెల‌ల‌కు ఒకసారి చొప్పున 100 సార్లు ర‌క్త‌దానం చేయ‌టం గొప్ప‌విష‌య‌మ‌ని ఇలా ర‌క్త‌దానం చేసిన వ్య‌క్తుల్లో మ‌హ‌ర్షి రాఘ‌వ ప్ర‌ప్ర‌థ‌ముడంటూ చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌ని చిరంజీవి అభినందించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday