Vijay Devarakonda : అతని మీద ఇంత నెగిటివిటీ ఎందుకు.. 600 కోట్ల సినిమా తీస్తే అంత దారుణంగా మాట్లాడతారా..?

Vijay Devarakonda  : ప్రభాస్ కల్కిలో మిగతా హీరోల క్యామియో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇద్దరు కల్కిలో కనిపించి ఫ్యాన్స్ ని అలరించారు. ఐతే విజయ్ దేవరకొండ చేసిన పాత్ర మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఏర్పడింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ తను వేసిన అర్జునుడి పాత్రకు సూట్ కాలేదని ఆ డైలాగ్ డిక్షన్ కూడా బాగాలేదని అంటున్నారు.

Vijay Devarakonda : అతని మీద ఇంత నెగిటివిటీ ఎందుకు.. 600 కోట్ల సినిమా తీస్తే అంత దారుణంగా మాట్లాడతారా..?
Vijay Devarakonda : అతని మీద ఇంత నెగిటివిటీ ఎందుకు.. 600 కోట్ల సినిమా తీస్తే అంత దారుణంగా మాట్లాడతారా..?

విజయ్ దేవరకొండ మీద ఇప్పటినుంచే కాదు ఎప్పటినుంచో ఈ నెగిటివిటీ ఉంది. తన సినిమా రిలీజ్ అయిన టైం లో కూడా విజయ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది అర్ధం కాదు. ఎవరు చేస్తున్నారు అన్నది తెలియదు కానీ రౌడీ హీరోని కావాలని టార్గెట్ చేస్తున్నారని స్పష్టంగా అర్ధమవుతుంది.

ప్రభాస్ కల్కి సినిమాను వైజయంతి మూవీస్ 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్, దీపిక పదుకినే మంచి పాత్రలు పోషించారు. ఐతే ఇన్ని పాత్రలు తీసుకున్న నాగ్ అశ్విన్ కి అర్జునుడిగా విజయ్ బాగుంటాడనే కదా తీసుకుంది. మరి నాగ్ అశ్విన్ సెలక్షన్ ని రాంగ్ అని ఆడియన్స్ ఎందుకు తప్పుపడుతున్నారు.

అఫ్కోర్స్ ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా విజయ్ తన డిక్షన్ ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చు. దానికి కల్కి రిలీజ్ అయిన దగ్గర నుంచి అతని మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే కచ్చితంగా ఎవరో పని కట్టుకుని విజయ్ దేవరకొండ మీద ఇలా నెగిటివ్ ఇంపాక్ట్ కలగచేస్తున్నారని అనిపిస్తుంది. ఐతే సినిమా నిన్న రిలీజై సక్సెస్ అవ్వడంతో విజయ్ దేవరకొండ సినిమా కొనేళ్ల పాటు గుర్తుండిపోతుందని అన్నాడు. తన మీద వస్తున్న ఈ నెగిటివిటీ మీద మాత్రం స్పందించలేదు విజయ్ దేవరకొండ. కల్కి సినిమాలో ప్రభాస్ కి ఈక్వల్ గా అమితాబ్ నటించాడు. బిగ్ బీ ఈ సినిమా హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో ఒకరని చెప్పొచ్చు.

Author