Keerthy Suresh : బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్

Keerthy Suresh : కీర్తి సురేశ్ అనగానే మనకు గుర్తొచ్చే మూవీ మహానటి. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది కీర్తి సురేశ్. ఆ సినిమా కంటే ముందు కీర్తి సురేశ్ చాలా సినిమాల్లో నటించినా రాని పేరు.. మహానటి మూవీతో వచ్చింది. ఆ తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా మూవీస్‌లో నటించింది. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇక కీర్తి సురేశ్ తాజాగా నటిస్తున్న మూవీ పేరు రఘు తాత. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.

Advertisement

keerthy suresh responds over trolls on her marriage

Advertisement

ఈసందర్భంగా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీంతో కీర్తి సురేశ్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నది. ఈనేపథ్యంలో కీర్తి సురేశ్ ను పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది మీడియా. మీ బెస్ట్ ఫ్రెండ్ ని మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ అడగడంతో తన పెళ్లి రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చేసింది బ్యూటీ.

రూమర్ గురించి మనం క్లారిటీ ఇస్తున్నామంటే అది నిజం కావచ్చు అని అనుకుంటారు. అందుకే నేను అలాంటి రూమర్స్ పై అస్సలు స్పందించను. ఒకవేళ నా యాక్టింగ్ గురించి, నా సినిమాల గురించి విమర్శిస్తే నేను తప్పకుండా వాటిపై స్పందిస్తా. కానీ.. నా పర్సనల్ లైఫ్ గురించి, నా ఫ్యామిలీ గురించి మాట్లాడినా, ట్రోల్ చేసినా నేను అస్సలు పట్టించుకోను.. వాటిని సీరియస్ గానూ తీసుకోను అంటూ.. అసలు విషయం చెప్పకుండానే కీర్తి సురేశ్ తప్పించుకున్నారు.

ఇక.. తన తాజా మూవీ విషయానికి వస్తే.. రఘు తాత మూవీ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. సుమన్ కుమార్ డైరెక్టర్. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఓ మహిళ వీరోచితంగా పోరాడే కథ ది. ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదలైంది.

Author