Tollywood No 1 Hero : ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రేంజ్‌కి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. తెలుగులో ప్రస్తుతం నిర్మాణమవుతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ హీరోలకి మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు వారితో కలిసి పని చేసేందుకు ఇతర భాషలకి సంబంధించిన దర్శక నిర్మాతలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tollywood No 1 Hero టాప్ స్టార్స్ వీళ్లే..
అయితే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అభిప్రాయం ఆధారంగా తెలుగులో టాప్ 10 హీరోల జాబితాని ఆర్మాక్స్ విడుదల చేసింది. ఆర్మాక్స్ సంస్థ తెలుగులో టాప్-10 హీరోలు ఎవరు? అనే విషయంపై సర్వే చేయగా, ఆ సర్వే ప్రకారం తెలుగులో నెంబర్ వన్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ నిలిచారు. సినిమా హిట్, ఫ్లాప్ అనేవాటితో సంబంధం లేకుండా కనీసం రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు డార్లింగ్ సినిమాలు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి కాబట్టి ఆయన ఇండియాలోనే టాప్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక రెండో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. పాన్ ఇండియా సినిమాలు ఇప్పటి వరకు చేయకపోయిన ఆయనకి ఈ ర్యాంక్ రావడం గ్రేట్.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మూడో స్థానం దక్కింది. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇడియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు దేవర, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక టాప్4లో అల్లు అర్జున్ ఉన్నాడు. అతనికి పుష్పతో మంచి క్రేజ్ రావడం మనం చూశాం. రామ్ చరణ్ కి 5వ ర్యాంక్ దక్కింది. గేమ్ ఛేంజర్‌తో అతని స్థానం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమలకి గ్యాప్ ఇచ్చి రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ టాప్ టాప్ 6లో ఉన్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు టాప్ 3లో లేకపోవడం ఊహించని పరిణామం. టాప్ 7లో నాని, టాప్ 8లో రవితేజ, టాప్ 9లో చిరంజీవి, టాప్ 10లో విజయ్ దేవరకొండ ఉన్నారు.