Pawan Kalyan : డిప్యూటీ సీఎం పదవి అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన మార్క్‌తో ముందుకు సాగుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం సోమవారం రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను కలిసింది. కొత్త ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు తెలిపారు. ఈ భేటీలో చిరంజీవి బావమరిది, అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కీలకంగా వ్యవహరించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్.. సమావేశం వివరాలను తెలిపారు. ‘ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. పవన్ కళ్యాణ్‌తో కులాసాగా మాట్లాడుకున్నాం’ అని సమావేశం అనంతరం అల్లు అరవింద్ అన్నారు.

Pawan Kalyan పిక్ అదిరిపోలా…
అయితే ఈ భేటిలో అందరిలోకి నాగార్జున మేనకోడలు , నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవర్‌స్టార్‌గా, జనసేనానిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మారడానికి కారణమైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ఆమె హీరోయిన్‌గా నిలిచారు. పవన్ సరసన జోడి కట్టే తొలి ఛాన్స్ ఆమెకే దక్కింది. సరిగ్గా 28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్, సుప్రియాలను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ఈవీవీ సత్యనారాయణ చేతుల్లో పెట్టారు చిరంజీవి, నాగార్జున. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబర్ 11న విడుదలై ఘన విజయం సాధించింది. అప్పటికే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమాలో వాటిని ప్రదర్శించి అభిమానులను అలరించారు.
వినూత్న కథలతో యూత్ ఐకాన్‌గా, పవర్‌స్టార్‌గా నిలిచిన ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. అయితే సుప్రియ మాత్రం హీరోయిన్‌గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తర్వాత చరణ్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్దిరోజుల్లోనే ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత చాలా కాలం పబ్లిక్‌గా దూరంగా ఉన్న సుప్రియ అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. ఇలాంటి వేళ తన తొలి సినిమా హీరోయిన్ తో పవన్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వారిద్దరి పిక్స్ వైరల్‌గా మారాయి.



