Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తను చేసే ప్రతి సినిమా విషయంలో చాలా ఆచి తూచి అడుగులేస్తుంది. అమ్మడు ఈమధ్య సౌత్ సినిమాల కన్నా నార్త్ సైడ్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్లు వస్తున్నా కూడా సమంత వాటిని కాకుండా బాలీవుడ్ ఆఫర్ అంటే మాత్రం ఓకే అనేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే సమంతతో వరుస క్రేజీ ప్రాకెటులు చేయాలని ఫిక్స్ అయ్యారు.బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే దర్శకుల గురించి పరిచయం అవసరం లేదు. ఐతే ఆ డైరెక్టర్స్ ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ లో సమంత నటించింది. ఆ సీరీస్ లో నెగిటివ్ రోల్ లో సమంత అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు సమంత వాళ్లే డైరెక్ట్ చేసిన సిటాడెల్ వెబ్ సీరీస్ లో కూడా నటించింది. ఆ సీరీస్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Samantha బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఆలోచనలో
ఇక ఇప్పుడు మరో సీరీస్ కు సైన్ చేసింది సమంత. అది కూడా రాజ్ & డీకే డైరెక్షన్ లోనే వస్తుందని తెలుస్తుంది. రాజ్ అండ్ డీకే తో సమంతకు బాగా సెట్ అయ్యింది. అందుకే వారు చేస్తున్న ప్రతి సీరీస్ లో సమంతకు ఛాన్స్ ఇస్తున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఆమె చేస్తున్న సినిమాల కన్నా అమ్మడు వెబ్ సీరీస్ ల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుందని తెలుస్తుంది.
మరి సమంత తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి. సమంత బాలీవుడ్ లోనే తిష్ట వేసేలా ప్లానింగ్ ఉన్నట్టు అర్ధమవుతుంది. తెలుగు కన్నా హిందీలోనే కెరీర్ బాగుంటుందని భావిస్తున్న సమంత అక్కడ ఏ చాన్స్ ని కూడా వలట్లేదని అర్ధమవుతుంది. మరి అమ్మడు చేసే సినిమాల వల్ల సమంతకు ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పడుతుందో చూడాలి. ఐతే సమంత పూర్తిగా సౌత్ సినిమాలు మానేస్తే ఎలా అంటున్నారు అమ్మడి తెలుగు అభిమానులు.