Ramya Krishna : హీరోయిన్ గా ఎద‌గాలంటే రాజీప‌డాల్సిందే… ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన రమ్యకృష్ణ…!

Ramya Krishna : ఒకప్పటి స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ రమ్యకృష్ణ Ramya Krishna అందరికీ సుపరిచితమే. ఆ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న రమ్యకృష్ణ తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో జరిగిన విషయాలను తెలియజేశారు. ఈ నేపథంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేశారు.

Ramya Krishna : హీరోయిన్ గా ఎద‌గాలంటే రాజీప‌డాల్సిందే... ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన రమ్యకృష్ణ...!
Ramya Krishna : హీరోయిన్ గా ఎద‌గాలంటే రాజీప‌డాల్సిందే… ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన రమ్యకృష్ణ…!

Ramya Krishna : హీరోయిన్ అవ్వాలంటే సర్దుకుపోవాల్సిందే..

అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలి అంటే కచ్చితంగా సర్దుకుపోవాల్సి ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో మొదట ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎవరు సెలబ్రిటీలు కాలేరు. మరి ముఖ్యంగా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చేవారికి ఇది మరింత సంక్లిష్టంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొన్ని ఏళ్లు గా తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై హీరోయిన్స్ స్పందిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు దీని గురించి మాట్లాడలేక భయపడిన వాళ్లు ఈరోజు గొంతు విప్పి నిజ నిజాలు బయటపేడుతున్నారు. ఒక్కప్పటి హీరోయిన్స్ నుండి మొదలు పెడితే ఇప్పటివరకు చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొనే వచ్చారని చెప్పాలి.

సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగాలి అంటే కచ్చితంగా పెద్దపెద్ద వాళ్లు కమిట్మెంట్ అడుగుతారని, ఒప్పుకోకపోతే అవకాశాలు రావని చెబుతూ బాధపడుతూ ఉంటారు. అంతెందుకు నయనతార Nayanatara, అనుష్క శెట్టి Anushka,రకుల్ ప్రీత్ సింగ్ , Rakul Preet Singh ,ఆదాశర్మ వంటి వారు కూడా ఒకప్పుడు ఈ సమస్యను ఎదుర్కొని హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్లే. అయితే ప్రస్తుతం ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశం వెండితెరతో పాటు బుల్లితెరకు కూడా చేరిందని చెప్పాలి. ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్టులను సీరియల్ హీరోయిన్స్ లను కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని మరి సందర్భాలలో సీరియల్ నటీమణులు చెప్పుకొస్తున్నారు.

Ramya Krishna నా విషయంలో అలా జరగలేదు…

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ అంశంపై తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందని , కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు అన్ని రంగాల్లో కూడా ఈ సమస్య ఉందని తెలియజేశారు. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలో అమ్మాయిలు అందరూ ఈ విషయంపై గొంతు విప్పడం వలన అందరి దృష్టి సినిమా వారి పైనే ఉందంటూ తెలిపారు. అయితే అన్ని సందర్భాలలోను అది నిజం కాదని కొన్ని సందర్భాలలో ఫేక్ న్యూస్ లు కూడా ప్రచారాలు చేసే అవకాశం ఉందని ఆమె తెలియజేశారు.

Ramya Krishna : హీరోయిన్ గా ఎద‌గాలంటే రాజీప‌డాల్సిందే... ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన రమ్యకృష్ణ...!
Ramya Krishna : హీరోయిన్ గా ఎద‌గాలంటే రాజీప‌డాల్సిందే… ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన రమ్యకృష్ణ…!

సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ ఎదగాలి అంటే కచ్చితంగా సర్దుకునిపోవాల్సి ఉంటుందని రమ్యకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే తాను మొదట్లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా విషయంలో మాత్రం అలా జరగలేదని తెలియజేశారు. ఇది ఇలా ఉండగా రమ్యకృష్ణ గారు 14 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. 1948లో “వెళ్లి మిందాన” అనే కోలీవుడ్ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత 1986లో భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ సౌందర్య, రోజా ,నగ్మా మీన వంటి వారికి రమ్యకృష్ణ గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీతో పట్టు పలు రకాల ఇండస్ట్రీలలో మొత్తం 200లకు పైగా సినిమాల్లో రమ్యకృష్ణ నటించారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts