Nag Aswin : కెరీర్ లో కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ 500 కోట్లతో కల్కి అంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. నేడు రిలీజైన కల్కి 2898 ఏడి సినిమా చూసిన వారంతా కూడా నాగ్ అశ్విన్ క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా కథ ఆలోచించడమే కాదు దాన్ని ఇంత గొప్పగా తీయడం అనేది కూడా చాలా గొప్ప విషయం.
కల్కి సినిమా వైజయంతి మూవీస్ 600 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. సినిమా చూసిన ఆడియన్స్ తెర మీద ప్రతి పైసా కనిపిస్తుంది. ఐతే కల్కి రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తన చెప్పులను షేర్ చేసిన నాగ్ అశ్విన్ చాలా పెద్ద ప్రయాణం ఇక్కడ దాకా తీసుకొచ్చాయని రాసుకొచ్చాడు.
Nag Aswin 600 కోట్ల దర్శకుడు అరిగిపోయిన చెప్పులతో
తను తీసిన సినిమా 600 కోట్ల బడ్జెట్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో అందులో నటించాడు. అలాంటిది నాగ్ అశ్విన్ తను స్లిప్పర్స్ వేసుకుని సినిమా చేయడం ఆయన సింప్లిసిటీకి అద్దం పడుతుంది. సినిమా తీయాలన్నె ప్యాషన్ ఉంటే చాలు చెప్పులు ఎలా ఉన్నాయ్ అన్నది కాదని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పాడు. ఇక కల్కి 2898 ఏడి సినిమాకు అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ వస్తుంది. బాలీవుడ్ మీడియా సైతం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించేలా ఉన్నాడు. సినిమా కచ్చితంగా 1000 కోట్లు రీచ్ అయ్యేలా ఉంది.