Naga Chaitanya Samantha : టాలీవుడ్‌కు Tollywood చెందిన సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూశాం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించని విధంగా విడిపోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. వీరు విడిపోయి మూడేళ్లు అవుతున్నా కూడా వీళ్ల గురించి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది.అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. ఇది చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్‌లో లవ్‌లో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత చై సామ్ పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు.
Naga Chaitanya Samantha నాగ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో ఎంజాయ్ చేశారు. పార్టీలకి వెళ్లడం, అక్కడికి సంబంధించిన అన్ని విషయాలని నెటిజన్స్‌తో షేర్ చేసుకోవడం మనం చూశాం. అయితే అంత హ్యాపీగా ఉన్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోయారు టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని తెలిపారు. అయితే ఈ జంట కలవబోతున్నట్టు చాలా సార్లు ప్రచారం చేశారు. కాని అది జరగలేదు. అయితే ఈ సారి మాత్రం అక్కినేని ఫ్యామిలీతో కలిసి సమంత సందడి చేయనుందని అంటున్నారు.
నాగేర్వరరావు, నాగార్జున, Nagarjuna నాగచైతన్య, అఖిల్, Akhil సమంత కీలకపాత్రలు పోషించిన మనం చిత్రం డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ దర్వకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అఖిల్, అమల అతిథి పాత్రలు పోషించారు. ఈ ఈ సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా.. మరోసారి మనం చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈనెల మే 23న మనం సినిమాను మరోసారి రిలీజ్ చేయనున్నారు. అయితే తమ ఫ్యామిలీకి ఎంతో బాగా కనెక్ట్ అయిన మనం కోసం ఈవెంట్ ప్లాన్ చేయాలని నాగార్జున భావిస్తున్నాడని, ఆ ఈవెంట్‌కి సమంతని ఇన్వైట్ చేయనున్నాడట. నిజంగా ఆమె వస్తే మాత్రం అభిమానులకి కన్నులపండుగగా ఉంటుంది.