Siri Hanmanth : సిరిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్.. నెక్ట్స్ కూర‌గాయ‌ల బండేనా..!

Siri Hanmanth : చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంటరైన సిరి.. ఈ మధ్య కాలంలో తనదైన రీతిలో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత హైలైట్ అవుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. సిరి హన్మంత్ ఆరంభంలో రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’, ‘అగ్ని సాక్షి’ వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో కూడా అవ‌కాశం ద‌క్కించుకుంది.

Siri Hanmanth : సిరిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్.. నెక్ట్స్ కూర‌గాయ‌ల బండేనా..!
Siri Hanmanth : సిరిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్.. నెక్ట్స్ కూర‌గాయ‌ల బండేనా..!

Siri Hanmanth సిరిని అంత మాట అనేశాడు..

సిరి హన్మంత్ ‘ఇద్దరి లోకం ఒక్కటే’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, ‘మరపురాని ప్రేమకథ’, ‘దట్’, ‘4 డేస్ విత్ సిరి’, ‘లవ్ అండ్ డౌట్’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు స్పెషల్ వీడియోలు చేసి పాపులారిటీని అందుకుంది.బిగ్ బాస్ షోలోను పాల్గొని సంద‌డి చేసింది. ఇక ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్‌లో హంగామా చేస్తుంది. అయితే సిరి హన్మంతు ప్రారంభంలో కాస్త సైలెంట్‌గా ఉన్నా, నెమ్మదిగా యాక్టివ్‌ అవుతుంది. తను కూడా చలాకీగా మారుతుంది. కానీ అనసూయ రేంజ్‌లో కాకపోయినా, ఫర్వాలేదనిపిస్తుంది. ఈ ఒక్క షోకే పరిమితమయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు జబర్దస్త్ కమెడియన్‌. తమ కామెడీ కోసం సిరిని వాడుకోవడం గమనార్హం.

తాజాగా నూకరాజు టీమ్‌ బుర్రకథ స్కిట్‌ని ప్రదర్శించారు. మొదట జడ్జ్ ఇంద్రజ గురించి చెప్పారు. ఆమె దానలు చేస్తుందని, విశాల హృదయం అని, చెన్నై నుంచి వస్తుందని, వచ్చే చెక్కులు తక్కువే అని తెలిపాడు. ఇలా ఆమెని ఆకాశానికి ఎత్తేశాడు నూకరాజు. అనంతరం సిరి ప్రస్తావన వచ్చింది. టీవీలో కనిపించేది థర్స్ డే(గురువారం). నెక్ట్స్ షెడ్యూల్‌ నుంచి హాలీడే, ఛాన్స్ లు లేక ఆమెకి మండే, నెక్ట్స్ కూరగాయల బండే` అంటూ బుర్రకథ చెప్పాడు నూకరాజు. దీంతో అంతా నవ్వులు పూయించారు. సిరి కూడా నవ్వులు చిందించింది. అయితే కామెడీ కోసం చెప్పడంతో దీన్ని అంతా పాజిటివ్‌గానే తీసుకున్నారు. సిరి కూడా స్పోర్టీవ్‌గానే తీసుకుంది.

Author