Aishwarya : సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఎప్పుడు ఒకేలా ఉంటానంటే కుదరదు. మడి కట్టుకు కూర్చుంటే అవకాశాలు ఎలా వస్తాయి. ఐతే కొందరు హీరోయిన్స్ మొదటి నుంచి గ్లామర్ షోస్ కి దూరంగా ఎలాంటి హద్దులు దాటకుండా కెరీర్ కొనసాగిస్తుంటారు. కొందరు మాత్రం తమకు వచ్చిన ప్రతి ఛాన్స్ వదలకుండా చేస్తూ గ్లామర్ సైడ్ కూడా రెచ్చిపోతుంటారు. ఐతే కొన్నాళ్లు పద్ధతిగా కనిపించి ఇప్పుడు అవకాశాలు లేక గ్లామర్ గా కనిపించుకోవాలని అనుకున్న వారు ఉంటారు.ప్రస్తుతం అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది కోలీవుడ్ భామ ఐశ్వర్యా రాజేష్. తమిళ, మలయాళ సినిమాల్లో తన సహజ నటనతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఎలాంటి పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తుంది.
ఐతే ఆమె నటనకు వంక పెట్టలేం కానీ ఎందుకో అమ్మడు సరైన సక్సెస్ అందుకోలేదు. మిగతా వాళ్లంతా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటుంటే అమ్మడు మాత్రం కేవలం తమిళ పరిశ్రమకే పర్మితమైంది.తెలుగులో కూడా ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకుంటుందట ఐశ్వర్య రాజేష్. ఇన్నాళ్లు పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా ఉన్న అమ్మడు ఇక మీదట గ్లామర్ షోతో రెచ్చిపోవాలని అనుకుంటుందట. ఇక్క స్కిన్ షో చేస్తే కానీ పని అవ్వట్లేదని లేటుగా గుర్తించిన ఈ హీరోయిన్ ఇక మీదట గ్లామర్ షోలో నో లిమిట్స్ అనేలా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట.
ఇప్పటికే ఐశ్వర్య ఈ డెసిషన్ తర్వాత ఒక క్రేజీ ఆఫర్ కొట్టేసిందని తెలుస్తుంది. కెరీర్ లో ఏదో ఒక డేర్ స్టెప్ వేయకపోతే కెరీర్ ముగిసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఏదైతే అది అయ్యింది అని ఐశ్వర్య రాజేష్ కూడా రెచ్చిపోయేందుకు సిద్ధమైంది. హీరోయిన్స్ ని గ్లామర్ రోల్స్ లో చూడాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఐతే ఫ్యామిలీ లుక్ తో ఉండే హీరోయిన్స్ కూడా గ్లామర్ షో చేస్తే మాత్రం వారికి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. మరి ఐశ్వర్య లోని ఈ మార్పు ఆమె కెరీర్ కు ఎంతమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.