Boora Narsaiah Goud : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫోన్ టాపింగ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమ్మారం లేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక దీనిలో భాగంగా పలు ప్రముఖ రాజకీయ నేతల యొక్క ఫోన్ కాల్స్ టాపింగ్ కు గురయ్యాయని దీనికి గల కారణం బీఆర్ఎస్ పార్టీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో వెనక ఉండి నడిపించిన వారిని కచ్చితంగా పట్టుకుంటామని ,వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొస్తుంది. ఇది ఇలా ఉండగా ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్త బుర్ర నరసయ్య గౌడ్ ప్రస్తావించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సినీ సెలబ్రిటీలు సైతం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం అనేది రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కాలేదని పోలీసులు సెలబ్రిటీలు ఒకే పార్టీకి చెందిన రాజకీయ నాయకులు పై కూడా దీని ప్రభావం పడిందని తెలిపారు. ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ఒక బిజినెస్ గా మలుచుకొని దీని ద్వారా ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసే వారి వద్ద నుండి అధిక మొత్తంలో దోచుకున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
దీని వెనక పెద్ద మాఫియానే ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం వలన సెలబ్రిటీలకు చెందిన ఓ పెళ్లి కూడా పేటాకులు అయిందని ఆయన తెలిపారు. ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం వలన టాలీవుడ్ సెలబ్రిటీలు అయినటువంటి అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బుర్ర నరసయ్య గౌడ్ తెలియజేశారు. వారి ఫోన్స్ టాపింగ్స్ గురి కావడం వలన వారిద్దరు విడిపోయారని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.