RK Roja : సినీ నటి మంత్రి రోజా నగరి నియోజకవర్గం నుంచి మూడో సారి గెలవాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భాను ప్రకాశ్ రెడ్డి పై వెనుకంజలోనే ఉంది. ఏ ఒక్క రౌండ్‌లో కూడా ఆధిక్యంలోకి రాకపోవడం విశేషం. దీంతో రోజా తన అనుచరులతో కౌంటింగ్ సెంటర్ నుంచి తిరిగి వెళ్లిపోయారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ అఖండ విజయంతో దూసుకుపోతుంది. అన్ని చోట్ల టీడీపీ, జనసేన , బీజేపీ ప్రతి రౌండ్‌లో ఆదిపత్యం కనిపిస్తోంది. దీంతో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మరో వైపు వైసీపీ అభ్యర్ధులు తమ ఓటమిని అంగీకరించి కౌంటింగ్ సెంటర్ల నుంచి నిష్కమించారు.
ఇక నగరి నియోజకవర్గం నంచి పోటీ చేసిన మంత్రి రోజా కూడా చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్ధి గాలి భాను ప్రకాశ్ 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన ప్రతి రౌండ్‌లో రోజాపై పూర్తి ఆధిపత్యం చూపించడం జరిగింది.
ఇది ఇలా ఉండగా రోజాపై ప్రముఖ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సెటైరికల్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ పిలుస్తోందిరా.. కదలిరా’ అంటూ రోజా ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.