Sreemukhi : పోయి పోయి ఆ సీనియర్ కమెడీయ‌న్‌తో శ్రీముఖి పెళ్లి.. ఎవ‌రు దొర‌క‌లేదా నీకు..!

Sreemukhi : ప్ర‌స్తుతం టాలీవుడ్ Tollywood  టాప్ Telugu Anchor Sreemukhi యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ఈ అమ్మ‌డు బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై కూడా తెగ ర‌చ్చ చేస్తుంది.కుర్ర హృదయాలను దోచుకునేలా శ్రీముఖి ఫొటోషూట్లు ఉంటున్నాయి. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో కాస్తా సైలెంట్ అయిన శ్రీముఖి మళ్లీ వరుస పోస్టులతో సందడి చేస్తోంది. ఇటీవల‌ ‘జాతి రత్నాలు’, ‘మిస్టర్ అండ్ మిస్సెస్’, ‘సారంగ దరియా’, ‘బీబీ జోడీ’ వంటి షోలను సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. ఇక, ఇప్పుడు ‘నీతోనే డ్యాన్స్ 2’తో పాటు ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది.

Advertisement

Sreemukhi ఏంటి ఇది.. శ్రీముఖి

శ్రీముఖి చేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో ప్రతి సండే ప్రసారం అవుతుండ‌గా, దీనిఇక మంచి ఆద‌ర‌ణ వ‌స్తుంది. ఇందులో శ్రీముఖితో పాటు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి కూడా సందడి చేస్తోన్నాడు. వీళ్లంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఇందులో బుల్లితెరపై సందడి చేస్తోన్న సెలెబ్రిటీలతో పాటు స్పెషల్ గెస్టులు వచ్చి రెండు టీమ్‌లుగా ఏర్పడి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో భాగంగానే ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు బుల్లితెర మెగాస్టార్లతో పాటు వెండితెర సూపర్ స్టార్లు వచ్చారు. వాళ్ల రాకతో షో సందడిగా సాగబోతుంది. తాజా ఎపిసోడ్‌లో నటీనటులు అన్నపూర్ణమ్మ, జయలలిత, శ్రీలక్ష్మి, బాబు మోహన్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లకు యాంకర్ శ్రీముఖి తనదైన రీతిలో వెల్‌కం చెప్పింది.

Advertisement
Sreemukhi : పోయి పోయి ఆ సీనియర్ కమెడీయ‌న్‌తో శ్రీముఖి పెళ్లి.. ఎవ‌రు దొర‌క‌లేదా నీకు..!
Sreemukhi : పోయి పోయి ఆ సీనియర్ కమెడీయ‌న్‌తో శ్రీముఖి పెళ్లి.. ఎవ‌రు దొర‌క‌లేదా నీకు..!

ఆ సమయంలో బాబు మోహన్ ‘నాకు ఎందరో ఫ్యాన్స్. కానీ, నేను శ్రీముఖి ఫ్యాన్‌ను’ అంటూ చెప్పి ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. ఎంతో సందడిగా సాగబోతున్న వచ్చే వారం ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో భాగంగా సీనియర్ నటీనటులు అందరూ కలిసి ‘ఆహా నా పెళ్లంటా.. ఒహోనా పెళ్లంట..’ అనే పాటను డ్యాన్స్ మూమెంట్లు చేస్తూ మరీ ఆలపించారు. ఆ సమయంలో వాళ్ల ముందు ఫన్నీగా ఏడుస్తూ కూర్చున్న శ్రీముఖి ‘నాకెందుకు అవడం లేదు పెళ్లి’ అంటూ డైలాగ్ కొట్టింది. యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి డైలాగ్ విసరగానే.. అక్కడే ఉన్న బాబు మోహన్ ఏమాత్రం తడుముకోకుండా ‘నిన్ను పెళ్లి చేసుకోడానికి నేను రెడీగా ఉన్నా కదా’ అంటూ పంచ్ వేశారు. ఇప్పుడు బాబు మోహ‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday