Anushka : అనుష్కని 5 కోట్లతో బుక్ చేసుకోవాలని అనుకున్నారు.. వాళ్లకి చుక్కలు చూపించిన స్వీటీ..!

Anushka : స్వీటీ అనుష్క చేస్తానంటే చాలు కానీ వరుస సినిమా ఛాన్సులు ఇస్తారు దర్శక నిర్మాతలు. తను ఎందుకు అలా చేయట్లేదు అన్నది ఆమె పర్సనల్ ఓపీనియన్. కానీ అనుష్కని ఎలాంటి సినిమాలో పడితే అలాంటి సినిమాలో నటింపచేయాలని చూస్తే మాత్రం ఆమె దిమ్మ తిరిగే రేంజ్ లో షాక్ ఇస్తుంది. నిశ్శబ్ధం తర్వాత 3 ఏళ్ల కెరీర్ గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ సినిమాలో అనుష్క మంచి మార్కులు కొట్టేసింది.

Anushka : అనుష్కని 5 కోట్లతో బుక్ చేసుకోవాలని అనుకున్నారు.. వాళ్లకి చుక్కలు చూపించిన స్వీటీ..!
Anushka : అనుష్కని 5 కోట్లతో బుక్ చేసుకోవాలని అనుకున్నారు.. వాళ్లకి చుక్కలు చూపించిన స్వీటీ..!

ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న అనుష్క మలయాళంలో ఒక ప్రాజెక్ట్ సైన్ చేసింది. ఇదిలాఉంటే ఈమధ్యనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అనుష్కని ఒక కమర్షియల్ సినిమాలో బుక్ చేసుకోవాలని అనుకున్నాడు. అనుష్కతో కథా చర్చలు కూడా నిర్వహించారట. స్టార్ హీరో సినిమాలో అనుష్క గ్లామర్ రోల్ చేయాలని ఆమెకు ప్రపోజల్ పెట్టారట. ఐతే ఇక మీదట చేస్తే గీస్తే పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తా తప్ప గ్లామర్ రోల్స్ చేయనని చెప్పిందట అనుష్క.

ఒకవేళ అనుష్క రెమ్యునరేషన్ కోసం అడుగుతుందేమో అని ఆమెకు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ కావాలంటే అంతకన్నా ఎక్కువే ఇస్తామని నిర్మాత అన్నారట. కానీ స్వీటీ మాత్రం రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా ఆ సినిమా చేయనని కరాకండిగా చెప్పేసిందట. అనుష్క ఇచ్చిన షాక్ తో దర్శక నిర్మాతలు తిరిగి వెనక్కి వెళ్లారని తెలుస్తుంది.

ప్రస్తుతం అనుష్క యువి క్రియేషన్స్ తోనే వరుస సినిమాలు చేస్తుంది. ఆమె ఏదైనా కొత్త కథలు.. కొత్త ప్రయోగాలు చేయాలని అనుకుంటుంది. అయితే అనుష్కని ఇక మీదట గ్లామర్ రోల్స్ లో చూడలేమా అని ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాల్లో కూడా చేస్తా కానీ ఆ కథ తన పాత్ర బాగా నచ్చాలని అంటుందట అనుష్క. మొత్తానికి అనుష్క మాత్రం తను చేయాలనుకుంటున్న పాత్రల మీద ఒక మంచి క్లారిటీతో ఉందని చెప్పొచ్చు. రాబోతున్న రెండు సినిమాలతో కూడా అనుష్క తన టాలెంట్ తో సర్ ప్రైజ్ చేయాలని చూస్తుంది.

Author