Anushka Marriage : పోయి పోయి ఏజ్ బార్ వ్య‌క్తిని అనుష్క‌ పెళ్లి చేసుకుంటుందా?

Anushka Marriage : అందాల ముద్దుగుమ్మ అనుష్క anushka shetty గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అంద‌రి మ‌న‌సులు దోచేసింది అనుష్క‌. అందం, అభినయంతో రాణించడంతో పాటు సినిమాల పరంగా విజయాలతో దూసుకెళ్తుంది. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. అనుష్క‌ను టాలీవుడ్ Tollywood అగ్ర హీరోయిన్ల‌లో  Star Heros నిల‌బెట్టిన సినిమాల్లో అరుంధ‌తి ఒక‌టి. 2009లో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. ప‌ద‌మూడు కోట్ట బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 70 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Advertisement
Anushka Marriage : పోయి పోయి ఏజ్ బార్ వ్య‌క్తిని అనుష్క‌ పెళ్లి చేసుకుంటుందా?
Anushka Marriage : పోయి పోయి ఏజ్ బార్ వ్య‌క్తిని అనుష్క‌ పెళ్లి చేసుకుంటుందా?

Anushka Marriage : అనుష్క పెళ్లి నిజ‌మేనా?

‘బాహుబలి’తో Baahubali Movie ఈ బ్యూటీ వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో అనుష్క రేంజ్ భారీగా పెరిగిపోయింది. ‘బాహుబలి’ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అనుష్క ‘సైజ్ జీరో’ అనే సినిమాలో నటించింది. ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనిపించేందుకు ఆమె భారీగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ మూవీ తర్వాత ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఇప్పుడు అనుష్క ‘ఘాటి’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అనుష్క-ప్రభాస్ Prabhas anushka shetty  కలిసి నాలుగు చిత్రాలు చేశారు. బిల్లా చిత్రం కోసం మొదటిసారి కలిసిన ఈ స్టార్స్.. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో జతకట్టారు. ఈ క్రమంలో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. త్వరలో పెళ్లి అంటూ మీడియా పలుమార్లు కథనాలు ప్రచురించింది. ఈ పుకార్లను ప్రభాస్-అనుష్క కొట్టిపారేశారు.

Advertisement
Anushka Marriage : పోయి పోయి ఏజ్ బార్ వ్య‌క్తిని అనుష్క‌ పెళ్లి చేసుకుంటుందా?
Anushka Marriage : పోయి పోయి ఏజ్ బార్ వ్య‌క్తిని అనుష్క‌ పెళ్లి చేసుకుంటుందా?

తాజా కథనాల ప్రకారం కన్నడ పరిశ్రమకు చెందిన నిర్మాతతో అనుష్క పెళ్లి  Anushka Marriage నిశ్చయం అయ్యిందట. త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇక సదరు నిర్మాత వయసు 44 ఏళ్ళు ఉంటుందట. అంటే ఏజ్ బార్ అయ్యాక పెళ్లి పీటలు ఎక్కుతున్నాడని చెప్పొచ్చు. అయితే అనుష్క ఏజ్ కూడా 40 ప్లస్. కాబట్టి అనుష్క విషయంలో సదరు నిర్మాతను ఏజ్ బార్ అనలేము. కాగా అనుష్క నిర్మాతను వివాహం చేసుకోబోతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday