Anjali : ఆ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది.. కెరీర్ రిస్క్ అన్ తెలిసినా తగ్గని అమ్మడు..!

Anjali : తెలుగు అమ్మాయి అంజలి అందరికీ సుపరిచితమే.. శివ నాగేశ్వర రావు తీసిన ఫోటో సినిమాతో తెరంగేట్రం చేసిన అంజలి ఆ తర్వాత కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఒక మోస్తారు ఇమేజ్ ని తెచ్చుకుని ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయిగా అంజలి మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

ఐతే సినిమాలైతే చేసింది కానీ స్టార్ రేంజ్ కి వెళ్లఏదు. ఆంధ్య ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేసింది అంజలి. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది అంజలి. ఆ సినిమాలో అమ్మడు వేశ్య పాత్రలో నటించింది. సినిమాలో అంజలిని అలా చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. అంజలి మాత్రం తను వేశ్యగా నటించడాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యింది.

Anjali : ఆ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది.. కెరీర్ రిస్క్ అన్ తెలిసినా తగ్గని అమ్మడు..!
Anjali : ఆ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది.. కెరీర్ రిస్క్ అన్ తెలిసినా తగ్గని అమ్మడు..!

Anjali అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయని అంటున్న అమ్మడు

సినిమాలో ఒక పాత్ర క్లిక్ అయితే అదే రోల్స్ మళ్లీ మళ్లీ వస్తాయి. అలానే అంజలి కి వరుసగా వేశ్య పాత్రలు వస్తున్నాయట. లేటెస్ట్ గ అంజలి బహిష్కరణ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో అంజలి మరోసారి వేశ్య పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ప్రదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఎలాంటి పాత్ర అయినా ఛాలెంజింగ్ తో చేసే అంజలి ఈ వేశ్య పాత్రలకు కూడా రెడీ అనేస్తుంది.

అంతేకాదు ఇలా అయినా తన కెరీర్ ఊపందుకుంటుందని అనుకుంటుంది అంజలి. వేశ్యగా మెప్పించి ప్రేక్షకుల మనసులు గెలిచిన వారు చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అనుష్క కూడా వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. సో అంజలి కూడా ఇక మీదట అలాంటి ఇలాంటిది అని కాదు పాత్ర నచ్చితే ఎలాంటి వాటికైనా సిద్ధమే అని చెబుతుంది. మరి అంజలిలోని ఈ మార్పు ఆమెకు అవకాశాల రూపంలో మళ్లీ కెరీర్ ని గాడిన పడేలా చేస్తాయేమో చూడాలి.

Author