Anasuya : భయమన్నది ఎరగని పాత్రలో అనసూయ.. పుష్ప-2 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!

Anasuya : దేశ వ్యాప్తంగా మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో పుష్ప-2 కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా 2021లో వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులోని అల్లు అర్జున్ మేనరిజం, డైలాగులు, పాటలు దేశాన్నే ఊపేశాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వారి దాకా.. సామాన్యుల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ సెలబ్రిటీల దాకా పుష్ప డైలాగులు, పాటలకు రీల్స్ చేశారంటే దాని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఏడాదంతా పుష్ప క్రేజ్ నడిచింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి పార్టుకు జనాలు నీరాజనాలు పట్టారు.

Advertisement

Anasuya యాంకర్ గా కెరీర్ స్టార్ట్..

ఆ సినిమాతోనే అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయనకు తిరుగులేని ఫాలోయంగ్ ఏర్పడింది. దెబ్బకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలామందే ఉన్నారు. అందులో అనసూయ కూడా ఉంటుంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు ఈ సినిమా తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. దెబ్బకు పెద్ద సినిమాల్లో ఆమెకు కీలక పాత్రలు వచ్చాయి. పుష్ప సినిమాలో మంగళం శ్రీను భార్య దాక్షాయణి పాత్రలో ఆమె పవర్ ఫుల్ గా నటించింది.

Advertisement
Anasuya : భయమన్నది ఎరగని పాత్రలో అనసూయ.. పుష్ప-2 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!
Anasuya : భయమన్నది ఎరగని పాత్రలో అనసూయ.. పుష్ప-2 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!

అయితే ఇప్పుడు పుష్ప-2లో కూడా ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇందులో ఆమె ఫస్ట్ లుక్ ను మే 15 ఆమె పుట్టిన రోజు సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఆమె ఓ బల్ల మీద పొగరుగా కూర్చుని ఉంది. ఆమె చుట్టూ రౌడీలు ఉన్నారు. ఆమె నడుముకు వడ్డానం పెట్టుకుని నోట్లో ఏదో నములుతూ కనిపిస్తోంది. ఎర్ర చందనం స్టాక్ ఉన్న చోట ఆమె ఏదో కోపంగా ఉన్న లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె ఫస్ట పార్ట్ కంటే ఎక్కువగా పవర్ ఫుల్ గా కనిపించేలా ఉంది. అంతే కాకుండా పుష్పరాజ్ కు ఆమెకు పవర్ ఫుల్ సీన్లు ఉండే ఛాన్స్ ఉంది.

గత సినిమాలో ఆమె పుష్పరాజ్ వల్ల నష్టపోయింది కాబట్టి ఈ పార్టులో ఆమె పగ తీర్చుకోవడానికి పోరాడే లేడీ రౌడీగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday