Mahesh Babu Movie : 1000 కోట్ల బడ్జెట్.. రాజమౌళి మహేష్ సినిమాపై పిచ్చెక్కిస్తున్న వార్త.. నిజమైతే మాత్రం..!

Mahesh Babu Movie  : RRR సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా గురించి సినీ ప్రియులంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మహేష్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న జక్కన్న సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించే ప్లానింగ్ చేస్తున్నాడు. మహేష్ సినిమా కోసం రాజమౌళి సినిమా బడ్జెట్ ని కూడా పెంచేస్తున్నాడని టాక్. 100, 200 కాదు ఏకంగా మహేష్ కోసం 1000 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నారని తెలుస్తుంది.

Mahesh Babu Movie : 1000 కోట్ల బడ్జెట్.. రాజమౌళి మహేష్ సినిమాపై పిచ్చెక్కిస్తున్న వార్త.. నిజమైతే మాత్రం..!
Mahesh Babu Movie : 1000 కోట్ల బడ్జెట్.. రాజమౌళి మహేష్ సినిమాపై పిచ్చెక్కిస్తున్న వార్త.. నిజమైతే మాత్రం..!

టాలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా ఇది ఆలోచిస్తేనే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బాలీవుడ్ మేకర్స్ కి కూడా ఇది సాధ్యం కాదు. కానీ ఈసారి జక్కన్న హాలీవుడ్ రేంజ్ సినిమా తీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే సినిమా బడ్జెట్ ని కూడా అదే రేంజ్ లో ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. ఐతే 1000 కోట్లు ఒక్క నిర్మాత అంటే కష్టం కాబట్టి ఈ సినిమా కోసం హాలీవుడ్ నిర్మాతలను కూడా భాగం చేస్తున్నాడని టాక్.

Mahesh Babu Movie  RRR తో ఇంటర్నేషనల్ క్రేజ్

రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతోనే తన డైరెక్షన్ స్టామినా ఇంటర్నేషనల్ లెవెల్ లో చూపించాడు రాజమౌళి. ఈ క్రమంలో ఆయన నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ వరల్డ్ ఆడియన్స్ అంతా మహేష్ తో రాజమౌళి తీసే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా కథ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని వేరే లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నడట.

1000 కోట్లతో ఇండియన్ హిస్టరీలోనే ఏ సినిమా తెరకెక్కలేదు. మొదటిసారి అది కూడా తెలుగు నుంచి ఒక సినిమా వస్తే మాత్రం ఆ సినిమాకు ఉండే ప్రత్యేకత వేరేలా ఉంటుంది. మరి రాజమౌళి 1000 కోట్లతో మహేష్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడన్నది చూడాలి. ఈ బడ్జెట్ పై వస్తున్న వార్తల్లో నిజం ఎంత అన్నది కూడా తెలియాల్సి ఉంది.

Author