Women : స్త్రీలు ఈ రంగు గాజులు ధరిస్తే.. ఐశ్వ‌ర్య క‌న‌క‌వ‌ర్ష‌మే కురుస్తుంది..!

Women  : హిందూ సంప్రదాయం ప్రకారం ఆడవాళ్లు ఎక్కువగా గాజులు ధరిస్తారు.అయితే సాధారణంగా వివాహమైన ప్రతి స్త్రీ గాజులను ధరిస్తారు. అసలు ఆడవాళ్లు గాజులను ఎందుకు ధరించాలి. దాని గల కారణలేంటి వంటి వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..హిందూ శాస్త్రంలో గాజులను స్త్రీకి రక్షణ కవచాలుగా చెప్పుకుంటారు.ఈ గాజులు ధరించడం వెనక సాంప్రదాయమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడే పుట్టిన పసిపాపలకి దిష్టి తగలకుండా నల్ల గాజులు వేస్తాం. ఆ నల్ల గాజులు వేసినప్పుడు ఆ పసిబిడ్డ మెరుగుగా ఉంటే ఆ బిడ్డ చేతుల గాజులను కదిలిస్తూ ఆ శబ్దానికి ఆడుకుంటాడు.

Women : స్త్రీలు ఈ రంగు గాజులు ధరిస్తే.. ఐశ్వ‌ర్య క‌న‌క‌వ‌ర్ష‌మే కురుస్తుంది..!
Women : స్త్రీలు ఈ రంగు గాజులు ధరిస్తే.. ఐశ్వ‌ర్య క‌న‌క‌వ‌ర్ష‌మే కురుస్తుంది..!

అంటే మన జీవితంలో పసి పిల్లగాడుగా ఉన్నప్పుడు మొదలైన గాజుల ప్రస్తావన మన జీవితం చివరి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది.ఇక పూర్వకాలంలో ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా గాజులు ధరించేవారు. ముఖ్యంగా చిన్నపిల్లల వాళ్ళకి చిన్నతనం నుండే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు.జీవితం చాలా విలువైనది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఈ గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచి ఆడపిల్లలకు అర్థమయ్యేలా చేయడం కోసమే ఈ గాజులు ధరింపచేయడం అలవాటు చేశారు మన పెద్దలు. అయితే గాజులు అందానికే కాకుండా సౌభాగ్యాన్ని కూడా చిహ్నం.గాజులు కూడా తమ రంగును బట్టి రకరకాల అర్థాలను తెలియజేస్తాయి.

Women  ఎరుపు రంగు.

ఎరుపు రంగు గాజులను ధరిస్తే తపో శక్తిని ఇస్తాయని అర్థం.

నీలం రంగు.

నీలం రంగు గాజులు ధరిస్తే విజ్ఞానం.

బోధ రంగు.

బోధ రంగు గాజులు ధరిస్తే స్వేచ్ఛ.

ఆకుపచ్చ రంగు.

ఆకు పచ్చ రంగు గాజులు ధరిస్తే అదృష్టం.

పసుపు రంగు.
పసుపు రంగు గాజులు ధరిస్తే సంతోషం.

నారింజ రంగు..

నారింజ రంగు గాజులు ధరిస్తే విజయం.

తెలుపు రంగు.

తెలుపు రంగు గాజులు ధరిస్తే ప్రశాంతత.

నలుపు రంగు.

నలుపు రంగు గాజులు ధరిస్తే అధికారం.

వెండి గాజులు.

వెండి గాజులు ధరిస్తే బలం.

బంగారు గాజులు.

బంగారు గాజులు ధరిస్తే ఐశ్వర్యాన్ని చూచిస్తాయి.

Women : స్త్రీలు ఈ రంగు గాజులు ధరిస్తే.. ఐశ్వ‌ర్య క‌న‌క‌వ‌ర్ష‌మే కురుస్తుంది..!
Women : స్త్రీలు ఈ రంగు గాజులు ధరిస్తే.. ఐశ్వ‌ర్య క‌న‌క‌వ‌ర్ష‌మే కురుస్తుంది..!

ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవాళ్లు కడుపుతో ఉండి పుట్టింటికి వస్తే వారికి ఐదో నెలలో గాని లేదా ఏడు నెలలొ సీమంతం చేసి తీసుకువస్తాం.అలా సీమంతం చేసేటప్పుడు ప్రతి ఒక్క ముత్తయిదువు మట్టి గాజులను స్త్రీ చేతులకు వేస్తారు.అయితే ఇలా ఎందుకు గాజులు వేస్తారు అని అంటే ఐదవ నెలలోనే గర్భస్థపిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి. గాజులు పగిలిపోవడానికి మనం ఆ మంగళం గా అశుభంగా పరిగణిస్తాం.

అందుకనే చాలామంది ఆడవాళ్లు గాజులు పగలడాన్ని ఇష్టపడరు. అయితే గాజులు పగలకుండా నడవడానికి సీమంతంలో గాజులు వేసే ఆచారాన్ని కనిపెట్టారు మన పూర్వీకులు.అయితే చాలామంది ధనవంతులు చేతులకి బంగారపు గాజులను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు.అలా గాజుల్లో ఒక రెండు అయినా మట్టి గాజులు ధరించాలని శాస్త్రం చెబుతుంది.అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజిస్తాం. ఇలా గాజుల వెనక చాలా గొప్ప అర్ధాలు ఉన్నాయి .కాబట్టి ప్రతి ఒక్కరి గాజులను తప్పక ధరించాలి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday