Makara Rashi : మకర రాశి వారు ఈ రాశి వారిని వివాహం చేసుకుంటే నక్క తోక తొక్కినట్లే…

Makara Rashi : మకర రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి..? వీరు ఏ రాశి వారు వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది…? అలాగే ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం… మకర రాశి అంటే శని భగవానుడు రాశి. శని భగవానుడి కారకత్వం ఉండడం వలన మీరు ఏ విషయమైనా తొందరపడి బయటికి మాట్లాడలేరు అలా అని లోపల బాధ పడుతూ ఉండరు. వివాహం అనేది మనస్తత్వానికి సంబంధించినది. అయితే మకర రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అంటే కుంభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు.

Advertisement

ఎందుకంటే వీరికి అధిపతి ఒక్కరే అయినా వీరికి పడదు. కుంభ రాశి వారికి ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్లడం అలవాటు ఖాళీగా ఇంట్లో ఉండడం వీరికి ఇష్టం ఉండదు. మకర రాశి వారికి ఒక విధంగా బద్ధకం అని చెప్పుకోవచ్చు. అలాగే మీన రాశి మీన లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. వాళ్లకుండే ఆలోచన విధానం వేరు. మీన రాశి వారు ఉంటే క్రమంగా పూజలో ఉంటారు లేదా క్రమంగా వినోదాలు విలాసాలలో ఉంటారు. వీటికి మకర రాశి వారు వ్యతిరేకంగా ఉన్నారు. వీరు పూజలు చేస్తామన్న రారు విందులు వినోదాలు అన్న కూడా వీరు రారు కేవలం వారికి అనిపించిందే చేస్తారు.

Advertisement

అలాగే మేష రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు. వీరి మనస్తత్వాలు కలవవు. మరి ఏ రాశి వారి వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది. అంటే వృషభ రాశి వారు వీరికి అనుకూలంగా ఉంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఎదుటివారు ఏం చెప్తే దానికి సర్దుకుపోవటం నీకు అలవాటు కాబట్టి వీరు వారి వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం చేసుకున్నవారు రాశులు కలవకపోవడం అలాగే వారి మధ్య విభేదాలు గనుక ఉన్నట్లయితే వారు ఈ పరిష్కారాలను చెయ్యాలి. పరిహారాలు. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం వంటివి చేయాలి. శని త్రయోదశి రోజున అభిషేకం చేయించుకోవడం. ఆంజనేయస్వామికి సింధూరంతో అభిషేకము. నవగ్రహాల ప్రదక్షిణాలు శని భగవానుడికి తైలాభిషేకం చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా ఒకరిపై ఒకరికి ఆకర్షణ పెరుగుతుంది.

Author