Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజు ఈ వస్తువులను దానం చేస్తే ఎన్ని శుభ ఫలితాలో…!

Mohini Ekadashi : హిందూమతంలో ఏకాదశి తిధికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఈ ఏకాదశి తిధిని వైశాఖమాసంలో శుక్లపక్షంలో 11వ రోజున మోహిని ఏకాదశిగా జరుపుకుంటారు. ఇక ఈరోజు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆరాధిస్తారు. అంతేకాక మోహిని ఏకాదశి రోజు దానధర్మాలు చేయడం అనేది చాలా మంచిది. మోహిని ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారని భక్తులందరికీ కూడా పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం. అయితే ఈ మోహిని ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయడం వలన పుణ్యంతో పాటు వారి యొక్క జీవితంలో కష్టాలు తొలగి సుఖసంతోషాలతో ఉంటారనేది ప్రజల నమ్మకం.

Advertisement

అయితే ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. ఇక ఈరోజు శక్తి మేరకు దానధర్మాలు చేయవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దానం చేసేటప్పుడు దానం చేసిన వస్తువుల యొక్క స్వచ్ఛతను గుర్తుంచుకోవాలి. వీటితోపాటు పేదవారికి సహాయం చేయడం వంటివి కూడా చేయాలి. ఇక ఏకాదశిలో ఉపవాస దానం చేసిన తర్వాత మాత్రమే దానిని సంపూర్ణంగా పరిగణిస్తారు.

Advertisement

Mohini Ekadashi మోహిని ఏకాదశి 2024…

పంచాంగం ప్రకారం భక్తులు మోహిని ఏకాదశి వ్రతం పూజా విధానం పారాయన సమయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే ఈ ఏడాది 2024లో మోహిని ఏకాదశి మే 19న రావడం జరిగింది. ఇది మే 19న ఉదయం ప్రారంభమై మరుసటి రోజు మే 20 సూర్యోదయంతో ముగుస్తుంది.

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజు ఈ వస్తువులను దానం చేస్తే ఎన్ని శుభ ఫలితాలో...!
Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజు ఈ వస్తువులను దానం చేస్తే ఎన్ని శుభ ఫలితాలో…!

Mohini Ekadashi ఏ వస్తువులు దానం చేస్తే మంచిది…

ఈ ఏకాదశి తిధి రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అవేంటంటే…

ధాన్యం : బియ్యం పప్పులు శనగలు గోధుమలు

పండ్లు : నారింజ ద్రాక్ష అరటి ఆపిల్..

పసుపు బట్టలు

రాగి సామాను

స్వచ్ఛమైన నెయ్యి

నిరుపేదలకు దుప్పట్లు

అవసరం ఉన్నవారికి మందులు దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

దానం ఎలా చేయాలంటే…

ఏకాదశి తిధి రోజు దానం చేయాలి అనుకునే వారు ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం దానం చేయాలి అనుకున్న వస్తువులను ముందుగా విష్ణుమూర్తికి సమర్పించాలి. ఆ తర్వాత దానం చేయాలి. ఇక ఈ మోహిని ఏకాదశి రోజు దానం చేయడం వలన పుణ్యఫలం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది