Laxmi Devi : ఇలాంటి సంకేతాలు వస్తుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే…!

Laxmi Devi : ఈ చిన్న పని చేయండి చాలు. ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేక లక్ష్మీ దేవత ఉందా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట్లో అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు. మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే మీకు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆగమనాన్ని మనం ఎలా గ్రహించగలం. ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాలను తెలుసుకోగలుగుతాం.ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లక్ష్మీదేవి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ,బంగారం, ముత్యాలు, రత్నాలు,శుభ్రమైన తెల్లటి వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి లోహాలు అదేవిధంగా ఆవు వృద్ధ స్థానం, ఆవు కొమ్ములు, పూజ మందిరంలోని కలశం, పవిత్రమైన మనసు దర్పణం అలాగే ఉత్తమమైన రాజు సద్ బ్రాహ్మణులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు తెలిపే మంత్రాలు చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే. శుభ్రత పాటించాలి. నిత్యం దీపారాధన, నిత్య ఆరాధన చేయాలి. సూచి శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని. లక్ష్మి అంటే లోకిక వ్యవహారల లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే మనం ఏమి చేయాలో కూడా శాస్త్రాల లో చెప్పబడ్డాయి. ముఖ్యంగా ముగ్గు వేసేవారు ఇంటి వాకిలి ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది…

Laxmi Devi : ఇలాంటి సంకేతాలు వస్తుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే...!
Laxmi Devi : ఇలాంటి సంకేతాలు వస్తుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే…!

ఏ ఇంట్లో అయితే ఇంటి వాకిలి ముందు ముగ్గు వేసి ఉంటుందో అట్టి వారి ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు. అందుకే తెల్లవారుజామున వాకిలి ఉడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు,శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. అదేవిధంగా ఇంట్లో ఆడవారు ఎక్కువగా అరిచినా, మాట్లాడిన, కోట్లాడిన అదేవిధంగా ఏ ఇంట్లో భార్యాభర్తలు నిరంతరం తగులు ఆడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో స్త్రీ అసంతృప్తిగా ఎప్పుడూ కన్నీటితో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్దాలు చెప్పేవారు సాయంత్రం సంధ్యా టైం లో భోజనం చేసేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఇటువంటి వారు ఉన్నచోట అక్కడ లక్ష్మి ఉండదు. సాయంత్రం సంధ్య టైమ్ లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. అలాగే పూజా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద సింహద్వారం వద్ద తప్పనిసరిగా దీపం పెట్టాలి…

ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఎక్కువగా మాట్లాడే వారు, గురువులను,పెద్దలను జూదరులు ఎక్కువగా ఉన్నచోట,అతినిద్ర లోన్లు ఉన్నచోట, అపరిశుభ్రంగా ఉన్న చోట అటువంటి ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు. పెద్దవారిని ఎవరైతే గౌరవించకుండా అవమానిస్తారో, తల్లిదండ్రులను, అత్తమామలను ఎవరైతే ఆగౌరపరుస్తారో అటువంటి వారి చోట లక్ష్మి ఉండదు. శంఖం ధ్వని వినిపించని చోట, తులసి కోట లేని చోట, దేవతారాదన చేయని చోట, సద్ బ్రాహ్మణులు సంచరించని చోట లక్ష్మీదేవి నివసించదు. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే చిల్లర డబ్బులు,అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా చూస్తారో అటువంటి ఇంట లక్ష్మీదేవి దరిచేరదు. అదేవిధంగా భక్తులను నిందించేవారు, హింసించేవారు నిద్రించేవారు ఇటువంటి వారు ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు. అందువలన లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండాలంటే ఇటువంటి పనులు చేయకుండా ఉండాలి. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు మనకు కనిపించే సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

అయితే అందరి అవసరాలకు ఆపదలను తీర్చేది ధనం మాత్రమే. ఈరోజుల్లో ఏం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్న అన్నింటికీ మూలం ధనమే. అయితే ఆ ధనానికి కొరత లేకుండా ఉండాలంటే. లక్ష్మీ అమ్మవారిని ముఖ్యంగా శుక్రవారం రోజు పూజ చేయాలి. అమ్మవారిని శుక్రవారం పూట ఆరాధించాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా మనం గుమ్మం లో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి కోట కనిపిస్తే ఇది లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తుంది. కుటుంబ సభ్యులు అంతా కలిసి సఖ్యతతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే భార్య భర్తలు గొడవలు,కొట్లాటలు లేకుండా సఖ్యతతో ప్రేమతో జీవిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే శ్రీ మహాలక్ష్మి దేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. ఈ సంకేతాలు పసి కడితే డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది మీకు.

అవి ఏమిటి అంటే. కోకిల కూత. కోకిల కూత మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. కోయిల చేసే శబ్దం ధనానికి శుభ సూచకంగా చెబుతున్నారు. మధ్యాహ్నం పూట కోయిల పూస్తే అది శుభ సూచికంగా చెబుతున్నారు. ముఖ్యంగా మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది. ఇక బల్లి. బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు. కానీ బల్లి శుభ సూచకంగా చెబుతున్నారు. మీ కుడి చేతి మీద బల్లి పడితే, అది త్వర త్వరగా పైకి పోవడానికి ప్రయత్నిస్తే, అది మీ అభివృద్ధికి సంకేతం. ఏదో ఒక రూపంలో ఆకస్మికంగా మీకు డబ్బు వచ్చి చేరుతుంది అని అర్థం. కావున బల్లిని శుభ సూచకంగా చెబుతారు. అదేవిధంగా చీమలు. ముఖ్యంగా నల్ల చీమలు ఇంట్లో ఉంటే అది శుభ సూచకంగా చెబుతున్నారు. ముఖ్యంగా నల్ల చీమలు వాటి నోటిలో బియ్యాన్ని,పసుపుతో కూడిన ఆహారాన్ని, పంచదారను తీసుకు వెళుతూ ఉంటే అది ఎంతో శుభ సూచకం.

త్వరలో మీరు కోటీశ్వరుడు కాబోతున్నారు అనే సంకేతాన్ని పది ఇస్తుంది. అయితే ఎర్ర చీమలు అంత మంచిది కాదు. ఎర్ర చీమలు కనుక ఇంట్లో తిరిగితే మీకు అప్పుల బాధలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే రెండు ముఖలు గల పాములు కనిపిస్తాయో అటువంటి పాపులు శుభసూచకంగా చెప్తారు. సాధారణంగా పాములను చూస్తే అందరూ భయపడతారు వాటిని చంపే దాకా నిద్రపోరు. కానీ పాములు కూడా శుభసూచకంగా చెబుతున్నారు. అందుకే పాము కనిపిస్తే దానిని చంపకుండా వాటిని బయటకు వెళ్లేందుకు దారిని వదలాలి. పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా చెబుతున్నారు.

అదేవిధంగా ఏ ఇంట్లో అయితే పరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ధూప, దీప కాంతులతో ప్రతినిత్యం వెలుగుతూ ఉంటుందో, అలాంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఏ ఇంట్లో అయితే శుభ్రమైన వాకిలి ఉంటుందో.శుభ్రమైన సింహద్వారం ఉంటుందో, తులసి కోట ముందు ఎప్పుడు ముగ్గుతో అలంకరించబడి ఉంటుందో, ఏ ఇంటి ఇల్లాలు అయితే ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా మౌనంగా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం సంధ్య టైంలో దీపారాధన చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుందో, అటువంటి చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాంటి చోట దరిద్ర దేవత అస్సలు అడుగుపెట్టదు…

Author