Lakshmi Devi : మీ ఇంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా… లక్ష్మీదేవి కటాక్షం అస్సలు ఉండదు జాగ్రత్త….!

Lakshmi Devi :మనం ఇంట్లో చేసే తప్పుల వలన ఉన్న దనం దూరం అవుతుందని మీకు తెలుసా… ఇంట్లో మీరు ఇలా చేసినట్లయితే ధనం మొత్తం పోయి దరిద్రం పట్టుకుంటుంది. ఇంట్లో తెలియక చేసిన కొన్ని పనుల వలన అప్పుల పాలయి రోడ్డున పడిపోతారు. అయితే మన దరిద్రం పోయి మనం ధనవంతులు కావాలి అంటే ఏం చేయాలి…?ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది…? అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సర్వసంపదలకు మూలం మహాలక్ష్మీ ఆమె వల్లనే మనకి ఆకర్షనీయమైన రూపం ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్య ద్వారా ప్రఖ్యాతి పొందుతున్నారు. లక్ష్మీ కటాక్షం మానవులందరికీ అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే అన్నింటా అభివృద్ధి అంతులేనంత సంపదలు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి అనుకునే వారంతా ప్రాణనాథుడు శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరు మీదుగా ఏర్పడిన శ్రావణమాసం లో విష్ణు వల్లభుడిని భక్తిశ్రద్ధలతో కొలిచి అమ్మవారి అనుగ్రహానికి పార్ధులై ధన కనక వస్తు వాహనాలను పొందాలి అని కోరుకుంటారు. సకల సౌభాగ్యాలకు సిరిసంపదలకు ఆవాసం శ్రావణమాసం కాబట్టి సంప్రదాయాలను పాటించే ప్రతి ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టి గడపలు పసుపు కుంకుమల తోటి సౌభాగమానంగా కనిపించే ఇంటిలోకి ఘల్లు ఘల్లు గజ్జల సందడితో లక్ష్మీదేవి కాలు పెడుతుంది.

Lakshmi Devi : మీ ఇంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా... లక్ష్మీదేవి కటాక్షం అస్సలు ఉండదు జాగ్రత్త....!
Lakshmi Devi : మీ ఇంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా… లక్ష్మీదేవి కటాక్షం అస్సలు ఉండదు జాగ్రత్త….!

అమ్మవారి కాలు స్పర్శ తగిలితే నటిల్లు బంగారం గా మారుతుంది.ఇక ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవ ఉండదు. తామర పుష్పాలు పాడి పంటలు ఏనుగులు ,గుర్రాలు, రత్నాలు గోవులు, అద్దాలు, శంకనాధులు ,గంటరావం, హరిహరాదా అర్చన , సర్వదేవతలను స్మరించే స్వరం, తులసి ఉన్న ప్రదేశం పువ్వులు మంగళకరమైన వస్తువులు మంగళ వాయిద్యాలలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంకా దీప కాంతులు కర్పూర హారతి చెట్లలో, హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం ధర్మబుద్ధి న్యాయస్థానం సుచి శుభ్రత, సౌమ్య గుణం స్త్రీలు ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండే ఇళ్లల్లో బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు సన్మాన సత్కారాలు కార్యాలు జరిగే ప్రదేశాలు వేదగోష సంపద క్రమశిక్షణ సమయపాలనలోనూ మహాలక్ష్మి దేవి నివసిస్తూ ఉంటుంది. సాధారణంగా చాలామంది ధనం అంటే డబ్బు ఒకటే అనుకుంటాం కానీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం , ధైర్యం ,విజయం ,అభయం , సౌర్యం , సౌభాగ్యం , సాహసం ,విద్యా , వివేకం , దానం , ధాన్యం, సంపద, బంగారం , వెండి ఆభరణాలు వస్తువులు వాహనాలు , ఆయుధాలు కీర్తి ప్రతిష్టలు సుఖ , సంతోషాలు , ఇవి అన్నీ కూడా సంపదలే. వీటన్నిటికీ అధినేత మహాలక్ష్మి దేవి. ఆమె అనుగ్రహం తోటి ఇవన్నీ సాధ్యం కాబట్టి ఆమెను పూజించి ఈ సంపద అన్నిటిని పొందుదాం. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలు అందుకే ఇంట్లో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే చాలా మంచిది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది రోలు రోకలి మీద కూర్చుంటూ ఉంటారు. అటువంటివి చేయకూడదు. చాలామంది మంచం మీద పసుపు కుంకుమలు డబ్బు పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు. గడప మీద కాలు పెట్టడం అనేది పొరపాటున కూడా చేయకూడదు. ఎందుకంటే గడప మహాలక్ష్మి స్వరూపం కాబట్టి అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకోండి. లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఎందుకంటే అరచేతులలో లక్ష్మీ స్వరూపం ఉంటుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులు చూసుకున్నట్లయితే మంచి జరుగును. అలాగే ఉదయం లేవగానే గోవు క్రిష్ట భాగాన్ని చూస్తే చాలా మంచిది. వాటితో పాటుగా ఉదయం నిద్రలేవగానే మంటను చూస్తే చాలా మంచిది.అలాగే సన్యాసిని నదీ ప్రవాహాన్ని చూసినా ఆరోజు చాలా విశేషమైన శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే పెరుగు తేనె కలిపి చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.అలాగే మారేడు కాయ ఉంటే దానిని చూడండి. ఉదయం నిద్ర లేవగానే మంచి సువాసనను ఇచ్చే పూలను చూడడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Author