Women Pregnant : ఒకసారి సరస్వతి దేవి బ్రహ్మదేవుడిని కలిసి తనకున్న సందేహాలకి సమాధానం తెలుసుకోవాలని అనుకుంది. మీరు ఈ సృష్టిని రచించారు. మీ శరీరం నుంచి ఎంతోమంది ఋషులని మునులని పుట్టించారు. ఎంతోమంది అందమైన అప్సరసలని, గంధర్వులను దేవతలను కూడా మీరే సృష్టించారు. మీరే స్త్రీలకి అందాన్ని ప్రసాదించారు. కానీ నాకున్న సందేహం ఏంటంటే కేవలం స్త్రీలకి మాత్రమే గర్భం ఎందుకు ప్రసాదించారు. ఈ బ్రహ్మాండంలో ఎందుకని కేవలం స్త్రీలు మాత్రమే గర్భం దాల్చగలుగుతున్నారు. దీని వెనుకున్న అసలైన కారణమేమిటి.? గర్భం దాల్చేటప్పుడు వచ్చే విపరీతమైన నొప్పి కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు అనుభవించాలి అని అడిగింది. ఈ ప్రశ్నలను విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ సరస్వతీదేవితో నువ్వు ఈరోజు మంచి ప్రశ్న అడిగావు.. ఈ బ్రహ్మాండంలో అన్ని రోగాల కంటే ఎక్కువ నొప్పి గర్భం దాల్చినపుడు వస్తుంది. గర్భం దాల్చేటప్పుడు స్త్రీలకి భయంకరమైన నొప్పి వస్తుంది…
Women Pregnant : దీని వెనుక ఒక కథ
దీని వెనుక ఒక కథ ఉంది. నేనిప్పుడు ఆ కథ నీకు చెప్తాను. దానిని నువ్వు చాలా శ్రద్ధతో విను ఎవరైతే ఈ కథను వింటారో వాళ్లకి మంచి పుత్రుడు జన్మిస్తాడు. కులస్య మహర్షి నా చెవి నుంచి జన్మించాడు. అతను నా మానస పుత్రులలో ఒకడు. నేను అతనికి ఎన్నో విద్యలు ప్రసాదించాను. అతన్ని సృష్టించడం వెనక ఉద్దేశాన్ని అతనికి చెప్పాను. ఈ లోక కళ్యాణం కోసం జీవితాంతం తపస్సు చేయమని నేను అతనికి చెప్పాను. అతను తన బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధమయ్యాడు. నేను చెప్పినట్టుగానే కులస్య మహర్షి సుమీర పర్వతం దగ్గర తపస్సు చేయడానికి బయలుదేరాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని ఒకరోజు ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో చాలామంది గంధర్వులు, దేవతలు, దానవులు ఆ ప్రదేశంలో తిరగడానికి వస్తూ ఉండేవారు.
వాళ్ళందరూ అల్లరి చేసి కులస్య మహర్షి తపస్సును భంగపరచాలి అనుకున్నారు. వాళ్ళు చాలాసార్లు కులస్య మహర్షిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. మొత్తం గమనించిన కులస్య కోపం వచ్చి అక్కడున్న గంధరులతో పాటు అప్సరసలను కూడా శపిస్తాడు. ఈ రోజు నుంచి ఎవరైతే నా తపస్సుకి భంగం కలిగించాలని చూస్తారో. వాళ్ళు కచ్చితంగా గర్భం దాల్చాస్తరని శపిస్తాడు. గంధర్వులు కూడా అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. ఆ పర్వతం పైన త్రినబంధు మహర్షి తన కుటుంబంతో పాటు నివసించేవాడు అతనికి ఆవిర్భావా అనే కూతురు ఉంది. తన స్నేహితులను వెతుక్కుంటూ సుమార పర్వతం పైకి వెళ్తుంది. కాసేపటికి కులస్య మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది. కాసేపటికి ఆమె శరీరం అంతా పచ్చగా మారింది. ఆ మరుక్షణంలోనే ఆమె గర్భవతిగా మారింది. ఒక్కసారిగా ఆమె శరీరంలో పెద్ద మార్పులు జరిగాయి. దీను చూసి ఆవిర్భావ చాలా భయపడింది. అంతలోనే తన స్నేహితులు ఆవిర్భావ దగ్గరికి వచ్చారు.
వెంటనే ఆవిర్భావ జరిగిందంతా తన స్నేహితులకు చెప్పింది. కాసేపటికి ఆవిర్భావ తన స్నేహితులతో కలిసి తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్లి తన తండ్రికి జరిగినదంతా చెప్పింది. తన కూతురిని ఈ పరిస్థితిలో చూసి తినబందు మహర్షి చాలా బాధపడతాడు. కాసేపు తన కూతుర్ని పరీక్షించిన తర్వాత కులస్య మహర్షి శాపం వలన తన కూతురికి గర్భం వచ్చిందని దీని గురించి తెలుసుకుని వెంటనే తన కూతురుని తీసుకుని సుమార పర్వతం పైకి వెళ్తాడు. పర్వతం పైనున్న కులస్య మహర్షి వెంటనే నమస్కరిస్తాడు. తన కూతుర్ని క్షమించమని కోరుతాడు. ఈ లోకంలో మీకు ప్రతి చోట కీర్తి ఉంటుంది. మీరు చాలా దయగలిగిన వారు ఈ రోజు నా కూతురు తెలియకుండా పాపం చేసింది. తనకి మీరు శాపం పెట్టిన విషయం తెలీదు. మీ శాపం వల్ల ఈ రోజు నా కూతురు గర్భవతిగా మారింది. ఈ బ్రహ్మాండంలో గర్భవతిగా మారిన మొట్టమొదటి స్త్రీ నా కూతురే.. అలాంటప్పుడు నా కూతురుని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు.
మీరు నా కూతురుని భార్యగా స్వీకరించండి నా కూతురికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. నా కూతురికి ఏ దోషము లేదు. తనకు తెలియకుండానే తనకి మీ శాపం తగిలింది.. తను జీవితాంతం మీకు సేవ చేస్తూనే ఉంటుందని చెప్పాడు. అప్పుడు కులస్య మహర్షి చాలా బాధపడ్డాడు. నా శాపం వల్ల మీ కూతురు గర్భవతిగా మారింది. ఈ కారణం చేతనే నేను మీ కూతురుని నా భార్యగా స్వీకరిస్తాను. మీరు ఇంకా దేనికి బాధపడకండి. ఈ విధంగా కులస్య మహర్షి స్వచ్ఛమైన హృదయంతో కులస్యం మార్షకి సేవలు చేస్తుంది. కులస్య మహర్షి ఆవిర్భావ చేస్తున్న సేవలను చూసి అత్యంత ప్రసన్నుడయ్యాడు. నేను నీ సేవ భక్తితో ప్రసన్నుడయ్యాను. అందుకనే నీకు నాలాంటి పుత్రుడని వరంగా ఇస్తాను. నువ్వు ఎప్పుడైతే నా ముందుకు వచ్చావో ఆ సమయంలో నేను వేదాలను పట్టిస్తున్నాను.
నువ్వు వేదల పట్టణం కూడా చేశారు. అందుకనే నీ కొడుకు వేదాలలో పండితుడై ఉంటాడు. ఈ పూర్తి ప్రపంచానికి వేదాలను ప్రచారిస్తాడు. ఈ ప్రపంచమంతా నీ కొడుకుని విశ్వవ మహర్షి అని పిలుస్తుంది. కొంతసేపటికి ఆవిర్భావ దేవికి ఒక అత్యంత గుణవంతుడైన కొడుకు పుడతాడు. కులశ్య శాపం వల్లనే ఈ ప్రపంచంలో అందరూ స్త్రీలకి గర్భం వస్తుంది. అందుకని ఈ లోకంలో స్త్రీలకి నేను ఎక్కువ నొప్పిని తట్టుకోగల శక్తిని ప్రసాదించాను.. వాళ్లలో నొప్పిని తట్టుకునే శక్తి పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే స్త్రీని సృష్టించడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. గర్భం దాల్చడం అనేది దొరికిన శాపం. కానీ నిజంగా చెప్పాలంటే గర్భం దాల్చడం అనేది స్త్రీలకు వరం.. ఈ విధంగా కులస్య చేసిన శాపం వలన ఈ లోకంలో స్త్రీలు గర్భవతులు అవుతున్నారు.