Cancer Horoscopes : కర్కాటక రాశిలో పుట్టిన వారి జాతక రహస్యాలు…!

Cancer Horoscopes : భారతదేశంలోని చాలామంది హిందువులు జ్యోతిష్య శాస్త్రాన్ని అమితంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే పుట్టిన నక్షత్రం ,రాశి ని ,ఆధారంగా చేసుకుని జాతకాలను చూసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కర్కాటక రాశిలో పుట్టిన మహిళలకు ,సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల జ్యోతిష్య పండితులు తెలిపారు. కర్కాటక రాశిలో పుట్టినటువంటి మహిళల జాతక రహస్యాలు ఏంటి…వారి జాతకం ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Advertisement

కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు సున్నిత మనసు కలిగి ఉంటారట .అందువలన వీరు ఏదైనా పని చేస్తే అది జరగకపోతే డిప్రెషన్ లోకి పోతారు .వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఒక లక్షణం అనేటటువంటివి ఉంటాయి. ఏదైనా సాధించాలి అని తపనతోనే వాళ్లు ముందుకు వెళ్తారు. అయితే ఈ రాశిలో జన్మించి వారి కి నిద్ర తక్కువ. కొంతమందికి శని దృష్టి గనుక ఉన్నట్లయితే బండనిద్రత ఉంటుంది. దీని కారణంగా జీవితంలో విలువ వెనక అడుగు వేసే ప్రమాదాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటారు.

Advertisement
Cancer Horoscopes : కర్కాటక రాశిలో పుట్టిన వారి జాతక రహస్యాలు…!
Cancer Horoscopes : కర్కాటక రాశిలో పుట్టిన వారి జాతక రహస్యాలు…!

Cancer Horoscopes : కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు…

అలాగే ఈ కర్కాటక రాశి వారు కెరియర్ లో ఉన్నత స్థాయికి వెళ్తారు. వీరు తమ ఫ్యామిలీ కన్నా కెరియర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వీరికి అనుకున్నది సాధించాలి అనే పట్టుదల ఉంటుంది.ఆ విధంగా ఈ కర్కాటక రాశి వారికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి వీళ్లు అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వెళ్లడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే వీరికి సంతానం మరియు బహుసంతానం అనేటటువంటివి కూడా ఉంటాయి. వీరు సున్నిత మనసు కలవారు కాబట్టి కఠినంగా మాట్లాడే ఉద్యోగాల్లో చేరడం మంచిది కాదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలలో వీరు రాణించలేకపోతారు. అలాగే సినీ రంగ, సాహిత్యాలలో నైపుణ్యాలను సంపాదించుకోవడం జరుగుతుంది.ఈ కర్కాటక రాశి మహిళలు ఏదైనా వ్యాపారం చేస్తే అందులో పురోగతి సాధిస్తారు. అలాగే వీరు పట్టుగలతో ఉంటారు కాబట్టి ఆ వ్యాపారం బాగా జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి స్త్రీలు దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా వీరి యొక్క జాతకం బాగుంటుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday