Mesh Rashi : మేష రాశి జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి.మేష రాశి వారికి అదృష్టం రాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయి..? వాటిని ఎలా గుర్తించాలి..? వాటిని గుర్తించకపోతే ఏ విధంగా నష్టపోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టితే అందులో పువ్వు వచ్చినప్పుడు అదృష్టంగా భావిస్తారు. అలాగే కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అపశకనంగా భావిస్తారు. కొబ్బరికాయలో పువ్వు వస్తే అది శుభసంకేతంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. ఇకపోతే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంచి రోజులు ప్రారంభం కాబోయే ముందు మేష రాశి వ్యక్తుల కలలో దేవుడిని చూడడం కలలో వారికి నిధి నిక్షేపాలు కనిపించడం , అలాగే మొక్కలు కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి అన్నీ కూడా కలలో కనిపించినట్లయితే త్వరలోనే మేషరాశి వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం కావడానికి ఇవి శుభసంకేతాలుగా భావించాలి.
మేషరాశి ఇంట్లో ఏదైనా వస్తువుకి నల్ల చీమలు పట్టి పాడైపోతే అది కూడా శుభసంకేతంగా పరిగణించాలి. అదే విధంగా మేషరాశి ఇంటి చుట్టుపక్కల ఏదైనా పక్షి గూడు కట్టుకున్నట్లయితే అది శుభసంకేతం. పక్షి గూడు అనేది సౌరుదికి సూచన ఎప్పుడైతే మన ఇంట్లో పక్షి గూడు పెట్టుకుంటుందో అది సమృద్ధికి సూచన అవుతుంది. ఇక గుడికి వెళ్లి వచ్చే సమయంలో ఎదురుగా తెల్లటి ఆవు గాని లేదా బ్రాహ్మణులు గాని ఎదురైతే అది మంచి శుభ సంకేతంగా పరిగణించవచ్చు. మేషరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది. సానుకూలమైన పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏదైతే మనసులో అనుకుంటారో అది నిజం కావడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మేష రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో పాజిటివ్ తో పాటుగా మనిషిలో సానుకూల శక్తి ఉంటుంది.
అలాగే ఏదైనా పని మీద వెళుతున్నప్పుడు దారిలో కొత్తగా పెళ్లయిన జంట ఎదురు వస్తే అది మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఇక మీ ఇంట్లో అకస్మాత్తుగా మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం.ఇది చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే ఇంటి చుట్టుపక్కల గబ్బిలం గూడు పెట్టుకుంటే అది శుభసంకేతంగా భావించాలి. ఇంటి మీద కోకిల కుస్తే మీ ఇంట్లోకి ధనం రాకకు సూచన. ఇక మీ జీవితంలోకి లక్ష్మీదేవి కటాక్షం రాబోయే ముందు ఈ సంకేతాలు కనిపించిన వెంటనే మీరు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఆ ఫలితాలను పొందవచ్చు.
పరిహారాలు : మేష రాశి వారికి శుభసంకేతాలు కనిపించినప్పుడు ఒక్క పేద బ్రాహ్మణునికి స్వయంపాకం దానంగా ఇవ్వాలి. 116 రూపాయలు దక్షిణ గా దానం ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.