Kanya Rashi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారు మరి కొద్ది రోజుల్లో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే కన్యా రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. మరి ఆ సంకేతాలు ఏంటి …? మీరు గమనించాల్సిన విషయాలు ఏంటి..? అలాగే కోటీశ్వరులు అయ్యే ముందు కన్య రాశి వారి విషయంలో ఏం జరుగుతుంది…?ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం….
సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఎంతగానో ఆమెను పూజిస్తారు. తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఉంటాయని ఎంతో విశ్వాసంగా నమ్ముతారు. తద్వారా వారి ఇంట సిరిసంపదలను వెల్లివిరుస్తుందని , వారిని ధనవంతులను చేస్తుందని పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి ఉండవు అని బలమైన నమ్మకంతో అమ్మ అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయ పడుతూ ఉంటారు. అలాగే కన్య రాశి వారి ఇంటికి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని శుభసంకేతాలు ఇచ్చి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు.ఎప్పుడు సంతోషంగా శుభ్రంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంటున్నారు. లక్ష్మీదేవి ఉండే ఇల్లు శ్రేయస్సును కల్పిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి రాకముందు కన్యారాశి జాతకులకు అనేక శుభసంకేతాలు ఇస్తుందని నమ్ముతూ ఉంటారు.
Kanya Rashi లక్ష్మీదేవి వచ్చే ముందు వచ్చే సంకేతాలు…
మనలో ప్రతి ఒక్కరు ధనలక్ష్మి ఆశీస్సులు కావాలి అని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలి అని కోరుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ధనం కొరత అనేది ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ధనం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలా కన్య రాశి వారు కూడా ఆ సంకేతాలను గుర్తించవచ్చు. మరి కోటీశ్వరులు కాబోయే ముందు కన్య రాశి వారికి వచ్చే ఆ శుభసంకేతాలు ఏంటి అంటే.. కన్య రాశి జాతకుల ఇంట్లో అకస్మాత్తుగా మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం.ఇది చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే శుభ సంకేతంగా గుర్తించాలి. ఏదైనా ఒక పక్షి మీ ఇంటికి వచ్చి గూడు కట్టుకుంటే అది శుభసంకేతం.
అయితే మీరు ఏ సందర్భం అయిన ఆ చెట్టును నరికేస్తే మీకు ఆశుభం కలిగే అవకాశం ఉంటుంది. కుడి చేతిలో దురద పుట్టినట్లయితే మీకు ఆర్థిక లాభాలు వస్తాయి అని అర్థం. మీరు రాత్రిపూట కలలో ఏనుగు గుడ్లగూబ ముంగిస, శంఖం,నక్షత్రం, గులాబీ, పాము వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగే అవకాశం ఉందని గుర్తించాలి. అదేవిధంగా కన్య రాశి వారు ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతున్నట్లు సంకేతంగా భావించాల్సి ఉంటుంది.