Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే.. ఇప్పటి వరకు ఏ ఒలింపిక్స్ వేడుకల్లో జరగని విధంగా సరికొత్తగా ఒలింపిక్స్ వేడుకలు ఆరంభమయ్యాయి. నదిలో వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నదిలో జరిగిన 6 కిమీల పరేడ్ లో 6800 మంది అథ్లెట్లు పార్టిసిపేట్ చేశారు. ఇక.. పారిస్ ఒలింపిక్స్ వేడుకలను తిలకించేందుకు ఏకంగా 3 లక్షల మంది అతిథులు హాజరయ్యారు. ఇలా.. ఒలింపిక్స్ చరిత్రలో ఇవన్నీ రికార్డే.
ఈ వేడుకలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాగ్, పలు అథ్లెట్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆరంభ వేడుకలు ప్రారంభం కాగాననే.. ఒక్కో దేశం పరేడ్ లో పాల్గొన్నది. భారత్ 84వ దేశంగా వచ్చింది. ఇక.. ఆరంభ వేడుకల్లో పాప్ సింగర్ లేడీ గాగా తన ఆటపాటలతో ఉర్రూతలూగించింది.
ఇండియా తరుపున భారత అథ్లెట్లు హుషారుగా పార్టిసిపేట్ చేశారు. అందులో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ భారత పతాకాన్ని పట్టుకొని పరేడ్ లో పాల్గొన్నారు. మిగితా ప్లేయర్స్ అంతా వాళ్ల వెనుక ఉత్సాహంగా పరేడ్ లో పాల్గొన్నారు. భారత అథ్లెట్లు అందరూ సంప్రదాయమైన తెల్లని డ్రెస్సుల్లో మెరిశారు. ఇండియా నుంచి మొత్తం అథ్లెట్లు, భారత ప్రతినిధులు అందరూ కలిపి 80 మందికి పైగా ఒలింపిక్స్ వేడుకలకు వెళ్లారు. ఇంకా కొందరు అథ్లెట్లు పారిస్ కు రావాల్సి ఉంది.