Ind Vs Pak : నో వే.. పాక్‌కి వెళ్లేదు లేదు.. భారత్ మ్యాచ్‌లు ఆడే వేదికలు మార్చాల్సిందే.. చాంపియన్స్ ట్రోఫీపై బీసీసీఐ డిమాండ్

Ind Vs Pak : భారత్ వర్సెస్ పాకిస్థాన్.. ఈ దాయాదుల పోరు ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్నదే. పాకిస్థాన్ జట్టు మాత్రం భారత్ కు వచ్చి, లేదంటే ఇతర దేశాల్లో చాలా సార్లు భారత్ తో తలపడింది. కానీ.. వచ్చే సంవత్సరం జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. దానికి కారణం.. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాక్ క్రికెట్ బోర్డు కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఆతిథ్యానికి సంబంధించి ఐసీసీకి షెడ్యూల్ కూడా ఇచ్చేసింది. ఈ ట్రోఫీలో భాగంగా ఎనిమిది దేశాలకు చెందిన టీమ్స్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. అది వన్డే ఫార్మాట్ ట్రోఫీ.

bcci clarifies about champions trophy in Pakistan

కానీ.. ఈ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే.. పాక్ కి వెళ్లి అక్కడ భారత్ మ్యాచ్‌లు ఆడే విషయంలో బీసీసీఐ సందిగ్ధంలో పడింది. ఎందుకంటే.. పాకిస్థాన్ కు వెళ్లి అక్కడ మ్యాచ్‌లు ఆడేది లేదని.. పాకిస్థాన్ కు భారత జట్టును పంపించమని బీసీసీఐ తేల్చి చెప్పింది.

Ind Vs Pak : భారత్ మ్యాచ్‌లన్నీ లాహోర్ స్టేడియంలోనే

చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే భారత్ మ్యాచ్‌లన్నీ లాహోర్ స్టేడియంలో ఉన్నాయి. కానీ.. సెక్యూరిటీ కారణాల వల్ల భారత జట్టు పాక్ కు వెళ్లదని బీసీసీఐ స్పష్టం చేసింది. కావాలంటే.. భారత్ ఆడబోయే మ్యాచ్ లు అన్నింటినీ శ్రీలంక లేదంటే దుబాయ్‌కి మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు.. చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడం కోసం కసరత్తులు చేస్తోంది.

Author