YS Sharmila : ఏపీని 8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టిన జగన్ : వైఎస్ షర్మిల

YS Sharmila : ఏపీని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆయనపై షర్మిల పలు విమర్శలు చేశారు. 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీ ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు షర్మిల. ఈనేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పని అని తెలిపారు.

ys Sharmila fires on ys jagan over ap debts

ఏపీకి ఎన్ని కోట్ల అప్పు ఉన్నా.. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. రాష్ట్ర ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో.. ఆ హామీలను త్వరగా నెరవేర్చాలని తమ పార్టీ తరుపున చంద్రబాబును కోరుతున్నామని షర్మిల స్పష్టం చేశారు.

YS Sharmila : రాష్ట్రం ఇప్పటి వరకు అనుభవించిన బాధలు చాలు

రాష్ట్రం ఇప్పటి వరకు అనుభవించిన బాధలు చాలు. ఇంకా ఆలస్యం అయితే రాష్ట్రం భరించలేదు. అందుకే ఇకనైనా రాష్ట్ర పరిస్థితిని ప్రభుత్వం చక్కదిద్దాలి. 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చివరకు విభజన హామీలను కూడా నెరవేర్చలేదు. కనీసం ఇప్పటికైనా విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

Author