Chandrababu : చంద్రబాబు కోరినవి కాదు మోడీ ఇవ్వాలనుకున్నవే ఇస్తారా..?

Chandrababu : ఏపీలో కూటమి విజయం తో పాటుగా ఎన్.డి.ఏ కి టీడీపీ సపోర్ట్ కూడా మరోసారి దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు ఈసారి వారికి సపోర్ట్ ఇచ్చి ఎన్.డి.ఏ ప్రభుత్వానికి ఆమోదం వేశారు. ఐతే దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన చంద్రబాబుకి మోడీ కచ్చితంగా మంచి కానుకలే ఇస్తారని అనుకున్నారు. ముఖ్యంగా దశాబ్ధ కాలంగా ఏపీకి రావాల్సిన నిధులు, స్పెషల్ స్టేటస్, పోలవరం ఇలా అన్నిటి మీద ఆంధ్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఐతే బాబు సపోర్ట్ కీలకమైనా సరే ఏపీలో ఏది కావాలన్నది కాదు మోడీ ఏవి ఇవ్వాలనుకున్నారో అవి మాత్రమే ఇస్తారని అంటున్నారు.

Chandrababu : చంద్రబాబు కోరినవి కాదు మోడీ ఇవ్వాలనుకున్నవే ఇస్తారా..?
Chandrababu : చంద్రబాబు కోరినవి కాదు మోడీ ఇవ్వాలనుకున్నవే ఇస్తారా..?

బాబు సపోర్ట్ ఈసారి కేంద్రంలో కీలకమైనా సరే గొంతెమ్మ కోరికలు అడిగితే తీర్చే పరిస్థితి ఐతే లేదు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చినట్టే రాష్ట్రానికి అప్పులు తెచ్చుకునే అవకాశం తో పాటుగా అమరావతి రైల్వే లైన్ వెనకబడ్డ జిల్లాల కోసం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది కానీ పోలవరం ఇంకా మిగతావన్నీ అడిగితే కష్టమే అంటున్నారు.

అదీగాక పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, ఒడిసా నుంచి కూడా మోడీపై ఒత్తిడి ఉంటుంది. అందుకే ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో ఈసారి కూడా ఆంధ్ర ప్రజలకు నిరాశ తప్పదని తెలుస్తుంది. ఐతే అలా కాదని చంద్రబాబు కూడా గట్టిగా మాట్లాడలేని పర్తిస్థితి. సో రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ శాతం నిధులు వచ్చేలా చేసుకోవడమే తప్ప పెద్దగా కేంద్రం నుంచి సహకారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఐతే రాబోయే ఐదేళ్లలో బాబు తన పరిపాలన విధి విధానాలతో ఏపీ గురించి అందరు మాట్లాడుకునేలా చేయాలని ఫిక్స్ అయ్యారు. అధికారం చేపట్టి కొద్దిరోజులే అవుతున్నా అందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర అభివృద్ధే ముఖ్య ఉద్దేశంగా వెళ్లబోతున్నారు. కేంద్రం ఇచ్చే సహకారాలను తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చూస్తున్నారు. టీడీపీతో పాటుగా జనసేన కూడా ఏపీలో కీలకంగా మారగా రెండు పార్టీలు కూడా ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసేలా కార్యచరణలు చేస్తున్నారు.

Author