Ycp Mla Candidate : ఓట‌రుని చెంప దెబ్బ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి.. తిరిగి ఇచ్చేసాడుగా.. వీడియో !

Ycp Mla Candidate : ఏపీ, తెలంగాణ కలుపుకొని నాలుగో విడతలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. బిహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో మొత్తంగా 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జోరుగా సాగుతోంది. అయితే ఎక్క‌డా కూడా ఎలాంటి అవాంచనీయ సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా పోలీసులు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే గా ఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే అహంకారం, అనుచరగణం చేసిన హత్యాయత్నానికి వందలాది ఓటర్లే ప్రత్యక్ష సాక్ష్యం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఐతానగర్​లో జరిగిన ఈ ఘటన అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

Ycp Mla Candidate ఓటరుపై చేయి చేసుకున్నాడుగా..

అధికార పార్టీ నేతల అహంకారానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ దారుణం ప్రతి ఒక్కరిలో నెత్తురు మరిగిస్తోంది. నాలి వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆయన్ని గమనించిన ఓ ఓటర్ లైన్లో నిల్చొని ఓటు వేయాలని సూచించారు. ఏ మాత్రం ఆలోచించకుండా అహంకారంతో అతడి దగ్గరకు వెళ్లి చెంపదెబ్బ కొట్టారు. వెంటనే ఓటరు కూడా ఎమ్మెల్యే శివకుమార్‌ చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరమూక విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓటరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటర్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Ycp Mla Candidate : ఓట‌రుని చెంప దెబ్బ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి.. తిరిగి ఇచ్చేసాడుగా..!
Ycp Mla Candidate : ఓట‌రుని చెంప దెబ్బ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి.. తిరిగి ఇచ్చేసాడుగా..!

ఈ ఘటనతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. వైసీపీ నేతల అరచాకలు పోలింగ్ బూత్‌లో కూడా కొనసాగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటువేసేందుకు వచ్చిన మహిళలు అక్కడి నుంచి భయంతో పక్కకు తప్పుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోను ఇలా రాక్ష‌సుల మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తే ఎలా అంటూ కొంద‌రు తిట్టిపోస్తున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts