Visakhapatnam YCP : విశాఖ వైసీపీలో అభ్యర్థుల వలసలు… అవకాశం దొరికితే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారా….?

Visakhapatnam YCP : ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు కానీ ఓడిపోయిన వైసీపీ లీడర్స్ అప్పుడే గోడ ఎక్కి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి నుండి పిలుపు వినబడితే వెనక ముందు ఆలోచించకుండా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అర్బన్ బూటర్స్ వైసీపీకి షాక్ ఇవ్వగా కూటమి అభ్యర్థులకు ఊహించని మెజార్టీలు దక్కాయి. గాజువాకలో 95 భీమిలీలొ 90 వేల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి మంచిక విజయ. ఇచ్చింది. ఈ స్థాయిలో కూటమి విజయం తర్వాత విశాఖ వైసీపీ నేతలకు భవిష్యత్తు చిత్రం కనబడుతుందట. మన కోయిల ముందే కుయ్యకుంటే వచ్చే ఐదేళ్లు రాజకీయపరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంచనా వేస్తున్న హిట్ లిస్ట్ లీడర్స్ టీడీపీ భాగస్వామి పక్షాలైన జనసేన బీజేపీల వైపు చూస్తున్నట్లు.. సమాచారం.

Advertisement
Visakhapatnam YCP : విశాఖ వైసీపీలో అభ్యర్థుల వలసలు... అవకాశం దొరికితే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారా....?
Visakhapatnam YCP : విశాఖ వైసీపీలో అభ్యర్థుల వలసలు… అవకాశం దొరికితే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారా….?

అందుకు తగ్గట్లుగానే నియోజకవర్గ పార్టీ ఆఫీసుల షెటర్లు ఒక్కొకటిగా మూతపడడం ఆశ్చర్యకరమేనని చెప్పుకోవాలి. ఎవ్వరు ఎప్పుడు కండువా మార్చేస్తారొ అనే చర్చ ఊపందుకోగా తీవ్ర గందరగోళం నెలకొంటుందని అంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే బిజినెస్ లను పక్కనపెట్టి పనిచేసిన ఓటమి ఎదురవ్వడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారట కొందరు వైజాగ్ వైసీపీ లీడర్స్. అదే సమయంలో సిటీలో వైసీపీని మరింత బలహీన పరిచే పనిలో భాగంగా జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి ఫోకస్ పెట్టింది అన్న ప్రచారం నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదట.ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అంచనా వేసుకుని కీలక నిర్ణయం తీసుకోవడమే మంచిది అనే ఆలోచనలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు సన్నిహితుల దగ్గర బయట పెడుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ డైరెక్ట్ గా టీడీపీ లోకి రావడం సాధ్యం కాదు కాబ్బటి జనసేన బీజేపీ వైపు ఫోకస్ పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే విశాఖ నగర పరిధిలోని తూర్పు ఉత్తర దక్షిణ పశ్చిమ నియోజకవర్గాలు చాలా కీలకమైనవి. ఇక్కడ బోని కొట్టాలి అని దశాబ్దాలుగా వైసీపీ ఎదురు చూస్తుంది.

Advertisement
Advertisement

ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి మీద సిట్టింగ్ ఎంపీ హోదాలో ఎంబిబిఎస్ సత్యనారాయణ పోటీ చేశారు. ఇదే సమయం లో ఎంబీబీ 100 కోట్లు పంచిపెట్టినట్టుగా ప్రచారం జరిగింది. అంత చేసిన ఇక్కడ టీడీపీ మెజారిటీ గతంలో కంటే ఎక్కువ పెరగడంతో ఎంబీబీకి మైండ్ బ్లాక్ అయిందని అంటున్నారు పరిశీలకులు. విశాఖ ఉత్తరంలో ఆఖరి నిమిషం వరకు గెలుపు గుర్రం అంచనాలు ఉన్న కేకే రాజు కూడా అనూహ్యంగా ఓడిపోయారు. ఆయనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భారీ మెజారిటీతో గెలిచారు. అటు పశ్చిమ్మ లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోవైపు నగరంలో రెడ్ బుక్ హోల్డింగ్స్ పై చర్చ జరుగుతుంది. వివాదాస్పందన నేతల ఎంట్రీ విషయంలో కూటమిలోని మూడు పార్టీలు అవగాహనతో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

సమస్తవగతంగా బలపడడం ఇప్పుడు టీడీపీ కంటే జనసేన బీజేపీ లకు చాలా కీలకం. అధికారంలో ఉన్నారు గనుక వలసలను ప్రోత్సహించి బలపడడానికి ఇదే సరైన సమయం అనుకున్నప్పటికి టీడీపీ షరతులే ఇక్కడ కీలకం అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీంతో ప్రస్తుతం వైసీపీని వీడాలి అని ఆలోచన చేస్తున్న నేతల భవిష్యత్తు ముఖచిత్రం ఏంటన్నది ప్రస్తుతానికి క్యూస్షన్ మార్క్ అనే చెప్పాలి.

Author