Vanga Geetha : పవన్ కల్యాణ్‌ ను అసెంబ్లీ గేటు తాకనివ్వను.. వంగా గీత సంచలన కామెంట్లు..!

Vanga Geetha : ఏపీలో రాజకీయాలు ఉన్నట్టు ఇంకెక్కడా ఉండవని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ వాడీ వేడిగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా అభ్యర్థుల మధ్య మాటలు హద్దులు దాటిపోతూనే ఉంటాయి. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా అదే స్థాయి వాడీ వేడి రచ్చ కనిపించింది. కానీ ఇప్పుడు అందరి కన్ను ఎక్కువగా పిఠాపురం మీదనే ఉంది. గతంలో పెద్దగా పేరు వినిపించని ఈ నియోజకవర్గం ఈసారి పవన్ కల్యాణ్‌ పుణ్యమా అని రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తున్నారు…

Advertisement

Vanga Geetha జగన్ హామీ..

కాపుల ఓట్లు ఎక్కవుగా ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఇక్కడ పవన్ ను ఓడించేందుకు జగన్ పెద్ద ప్లానే వేశారు. కాపు కులానికే చెందిన వంగా గీతను ఇక్కడి నుంచి పోటీకి దింపారు. అంతే కాకుండా ఆమెను గెలిపిస్తే ఏకంగా డిప్యూటీ సీఎంను చేస్తానంటూ తెలిపారు జగన్. దాంతో పాటు పిఠాపురంలో వంగా గీత బలంగానే ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే పోలింగ్ అయిపోయిన తర్వాత మొదటిసారి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా మరోసారి వైఎస్ జగన్ సీఎం అవుతున్నారని తెలిపారు.

Advertisement
Vanga Geetha : పవన్ కల్యాణ్‌ ను అసెంబ్లీ గేటు తాకనివ్వను.. వంగా గీత సంచలన కామెంట్లు..!
Vanga Geetha : పవన్ కల్యాణ్‌ ను అసెంబ్లీ గేటు తాకనివ్వను.. వంగా గీత సంచలన కామెంట్లు..!

రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదంటూ తెలిపారు. ఇక కాకినాడ ఎంపీ స్థానం వైసీపీ గెలుస్తుందని.. పిఠాపురంలో తానే గెలుస్తున్నట్టు తెలిపారు. పవన్ కల్యాణ్‌ తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటలేరంటూ తెలిపారు. తాను లోకల్ అభ్యర్థిని అని.. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా పిఠాపురంను వదిలి వెళ్లలేదంటూ ఆమె తెలిపారు. పవన్ కల్యాణ్‌ కేవలం జ్వరం వస్తేనే హైదరాబాద్ పారిపోతారని.. అలాంటి వ్యక్తి పిఠాపురంలో ప్రజా సమస్యలను ఎలా పట్టించుకుంటరాని ప్రశ్నించారు.

ఆ విషయాలు జనాలకు బాగా తెలుసు కాబట్టి ఈ సారి పిఠాపురంను జగన్ కు బహుమతిగా ఇస్తున్నట్టు తెలిపారు. రాబోయే జూన్ 4న తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్నట్టు తెలిపారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday