ఏపీలోని కొన్ని ప్రాంతాలు రాజకీయ పార్టీల గెలుపును శాసిస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు ఒక్కటి ఉంది. అదేంటంటే 101 నియోజకవర్గాల కోస్తా ప్రాంతం. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, గుంటూరు దాకా ఉంటుంది. ఇక్కడ గనక భారీ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీదే అధికారం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉన్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి మరో 34 సీట్లు ఉన్నాయి. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలుపుకుని మరో 33 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 101 సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ గనక టీడీపీ 70 సీట్లు సాధిస్తే అధికారం వారిదే అంటున్నారు.
ఎందుకంటే 2014లో ఇక్కడ టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ 88కి దగ్గరగా సీట్లు వచ్చాయి. దాంతో సునాయాసంగా ఏపీలో అధికారం టీడీపీది అయిపోయింది. కాగా ఇప్పుడు 2024లో కూడా అదే జరుగుతుందని వారు అంటున్నారు. ఉత్తరాంద్రలో తమకు కనీసంగా ఇరవై సీట్లు గోదావరి జిల్లాలలో మరో పాతిక సీట్లు అలాగే క్రిష్ణా గుంటూరులలో పాతిక సీట్లు గెలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం కలిపితే 70 సీట్లు వస్తాయని అంటున్నారు. ఇక అటు గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాలో కలిపితే మొత్తం 74 సీట్లు ఉన్నాయి. అక్కడ తమకు ఎంత లేదన్నా మరో పాతిక నుంచి 30 సీట్లు అయినా వస్తాయని అంటున్నారు.
కాబట్టి ఈజీగా తమదే అధికారం అంటున్నారు టీడీపీ కూటమి నేతలు. అయితే ప్రతిసారి అనుకున్నది జరగదని వైసీపీ నేతలు అంటున్నారు. తమకు అధికారం ఖాయం అంటున్నారు. తమకు కోస్తా బెల్ట్ లో కచ్చితంగా 50 దాకా సీట్లు వస్తాయని, గ్రేటర్ రాయలసీమలో మరో యాభై సునాయాసంగా వస్తాయని.. కాబట్టి ఎంత లేదన్నా 100 సీట్లతో అధికారం సాధిస్తామని చెబుతోంది వైసీపీ పార్టీ. ఈ సారి పోలింగ్ పెరిగిందని.. ఆ పెరిగిన పోలింగ్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనిదే అని చెబుతున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు మొత్తం వైసీపీ వైపే ఉన్నట్టు చెబుతున్నారు. ఆ విధంగా అధికారం తమకే సొంతం అవుతుందని అంటున్నారు. మరి ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు కానీ ఇంతకీ అధికారం ఎవరికి దక్కుతుందనేది చూడాలి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.