Telangana Budget 2024 : బడ్జెట్‌లో హైదరాబాద్‌కే ఎక్కువ కేటాయింపులు.. కారణం అదేనా?

Telangana Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా హైదరాబాద్ కే కేటాయింపులు చేసింది. హైదరాబాద్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. జీహెచ్ఎంసీకి ఎక్కువ కేటాయింపులు చేసింది.

Telangana budget 2024 - 2025 highlights

అన్ని డిపార్ట్ మెంట్ లకు కలిపి హైదరాబాద్ కోసం రూ.22,800 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.3065 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే జలమండలికి రూ.3385 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, ఎయిర్ పోర్ట్ మెట్రో రైలుకు రూ.500 కోట్లు, మూసీ సుందరీకరణ కోసం రూ.1500 కోట్లను కాంగ్రెస్ సర్కారు కేటాయించింది.

అయితే.. బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత రాజధానికి ఇవ్వడం వెనుక కారణం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. రాజధాని ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ హవానే నడిచింది. అంటే.. బీఆర్ఎస్ హైదరాబాద్ ను డెవలప్ చేసిందని అక్కడి ప్రజలు నమ్మారు. అందుకే హైదరాబాద్ లోని ప్రజలంతా కాంగ్రెస్ వైపు మళ్లేందుకు నగర ప్రజలను ఆకర్షించేందుకే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు చేసినట్టుగా చెబుతున్నారు.

Author