TDP : తెలంగాణాలో టీడీపీ జెండా.. నెక్స్ట్ ఎలక్షన్స్ కి బిగ్ ప్లాన్ రెడీ.. తెలుగు తమ్ముళ్లని హుశారెత్తించే న్యూస్..!

TDP  : ఏపీలో టీడీపీ గ్రాండ్ విక్టరీ తెలంగాణాలో ఉన్న తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలగాణా వచ్చాక గత పదేళ్లుగా క్రమక్రమంగా టీడీపీని ఇక్కడ లేకుండా చేశాడు గులాబి అధినేత కె.సి.ఆర్. ఐతే గత ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ఓటమి ఎంపీ స్థానాల్లో గెలవకపోవడం ఆ పార్టీ సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ మీద గట్టి దెబ్బ కొట్టింది. అధికారం లో ఉన్న కాంగ్రెస్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఐతే తెలంగాణాలో రెండో అతి పెద్ద పార్టీగా ఎదిగేందుకు ఓ పక్క బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది.

ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీ కూడా తెలంగాణాలో మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది. ఎలాగు ఏపీలో వాళ్ల ప్రభుత్వమే ఉంది కాబట్టి తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి భయం ఉండదు. అదీగాక ఆ పార్టీని తొక్కేయాలని అనుకున్న కె.సి.ఆర్ కూడా ఇప్పుడు బలహీనమయ్యాడు. సో టీడీపీకి ఇది కచ్చితంగా మంచి ఛాన్స్. ఏపీలో టీడీపీ విన్ అని తెలియగానే తెలంగాణాలో ఉన్న టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకున్నారు.

TDP : తెలంగాణాలో టీడీపీ జెండా.. నెక్స్ట్ ఎలక్షన్స్ కి బిగ్ ప్లాన్ రెడీ.. తెలుగు తమ్ముళ్లని హుశారెత్తించే న్యూస్..!
TDP : తెలంగాణాలో టీడీపీ జెండా.. నెక్స్ట్ ఎలక్షన్స్ కి బిగ్ ప్లాన్ రెడీ.. తెలుగు తమ్ముళ్లని హుశారెత్తించే న్యూస్..!

ప్రస్తుతానికి టీడీపీ ఇక్కడ అధికారం చేపట్టే ఛాన్స్ లేకపోయినా దానికి ఉన్న ఓటు బ్యాంక్ అలానే ఉందని చెప్పొచ్చు. ఐతే నెక్స్ట్ ఎలక్షన్స్ కి మళ్లీ టీడీపీ తెలంగాణాలో కూడా బలం పెంచుకోవాలని చూస్తుంది. తెలంగాణాలో కూడా టీడీపీకి బలం ఉంది. ఐతే ఆ ఓట్ బ్యాంక్ బయటకు రావాలంటే ఇక్కడ బలమైన నాయకుడు అవసరం. మరోపక్క జనసేన నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణాలో కూడా గురి పెట్టాలని చూస్తున్నారు.

సో ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్, బి.ఆర్.ఎస్, బీజేపీతో పాటుగా టీడీపీ, జనసేన కూడా తెలంగాణాలో తమ ప్రభావం చూపించాలని చూస్తున్నారు. కచ్చితంగా ఇది ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలకు తీపి వార్తే అని చెప్పొచ్చు. ఎలాగు ఏపీలో అధికారం లో ఉన్నాం కాబట్టి తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసేలా టీడీపీ నేతలు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారని అర్ధమవుతుంది. మరోసారి తమ క్యాడర్ ని మేలుకొలిపి ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని చూస్తున్నారు. సో 2029 లో తెలంగాణాలో కూడా టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా రంగం సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు.

Author