Revanth Reddy : అదేంటో రాజకీయం అంటే ఆటగా మారింది నేతలకు. అధికారంలో ఉన్న పార్టీదే ఈ ఐదేళ్లు మళ్లీ గెలిచే వరకు మనది కాదన్నట్టు ఓడిన వారి పరిస్థితి ఉంది. ఇక గెలిచిన అభ్యర్ధులు కూడా అధికారం లేని పార్టీలో ఉండటం కన్నా అధికార పార్టీలోకి జంప్ అవ్వడమే మంచిదని అనుకుంటున్నారు. తెలంగాణాలో అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పదేళ్ల గులాబీ పార్టీ పాలన చాలని ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.
గత పదేళ్లుగా కే.సి.ఆర్ ప్రభుత్వం చేసిన తప్పునే ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన వారు అధికార పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఈ ఆనవాయితీని కేసి ఆర్ బాగా ఎంకరేజ్ చేశారు. కొందరు స్వతహాగా బి.ఆర్.ఎస్ లోకి రాగా మరికొందరు బలవంతంగా వచ్చేలా చేశారు. ఎలా వచ్చినా గెలిచిన వారు ఓడిన వారు ఒకే పార్టీలో అన్నట్టు ఉండేది.
Revanth Reddy తమపై గెలిచిన వారితోనే కలిసి పనిచేయడం ఎలా
ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉండటం వల్ల గెలిచిన బి.ఆర్.ఎస్ అభ్యర్ధులను కాంగ్రెస్ లోకి తీసుకుంటుంది. బి.ఆర్.ఎస్ గెలిచిన అభ్యర్ధులు అంటే కాంగ్రెస్ లో వారితో ఓడిపోయిన వారు. ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించిన వారిని వాళ్లతో కలిసి పొమ్మంటున్నారు. ఈ పద్ధతి ఎప్పటికైనా మళ్లీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని కొందరు చెబుతున్నా వచ్చే వాళ్లని ఎలా కాదనగలం అంటూ కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుంది. చూస్తుంటే బి.ఆర్.ఎస్ లో సొంత ఫ్యామిలీ సభ్యులు తప్ప మిగతా వారంతా కాంగ్రెస్ లోకి వచ్చేలా ఉన్నారు. ఐతే ప్రజలు మాత్రం రేవంత్ కూడా కేసి ఆర్ చేసిన తప్పే చేస్తున్నారని అంటున్నారు.