Revanth Reddy : మాజీలెందుకు దండగ అంటున్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : తెలగాణాలో బీ.ఆర్.ఎస్ ని ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ఆకర్షణ కార్యక్రమాలు సఫలమవుతున్నాయని చెప్పొచ్చు. గులాబీ పార్టీలో కేవలం కె.సి.ఆర్, కె.టి.ఆర్, హరీష్ రావు, పల్ల రాజేశ్వర్ తప్ప మిగతా అందరు ఆధికార పార్టీ కాంగ్రెస్ లోకి చేరే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బి.ఆర్.ఎస్ నుంచి తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. వీళ్లే కాక మరో 20 మంది కూడా సమయం చూసుకుని కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే పరిస్థితి ఉందని తెలుస్తుంది.

Revanth Reddy : మాజీలెందుకు దండగ అంటున్న రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : మాజీలెందుకు దండగ అంటున్న రేవంత్ రెడ్డి..!

బి.ఆర్.ఎస్ మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఐతే బి.ఆర్.ఎస్ నుంచి గెలిచిన వారితో పాటుగా ఓడిపోయిన వారు అంటే మాజీలు కూడా కొందరు కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాంగ్రెస్ గూటికి చేరుతారని బలంగా వినిపిస్తున్న వార్త. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాజీలపై అంత ఆసక్తిగా లేరన్నట్టు తెలుస్తుంది.మాజీలను తీసుకుని ఉపయోగం ఏమి లేకపోగా మళ్లీ వాళ్ల వల్ల కాంగ్రెస్ సీనియర్స్ నుంచి గొడవ మొదలవుతుందని భావిస్తున్నారట. ఐతే మాజీల కన్నా ముందు గెలిచిన బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలకే మొదటి ప్రాధాన్యత అంటున్నారట. చూస్తుంటే ఐదేళ్లలో బి.ఆర్.ఎస్ లో సొంత కుటుంబ సభ్యులే తప్ప మిగతా ఎవరు కూడా పార్టీలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

ఉద్యమ పార్టీ తెలంగాణాని తెచ్చిన పార్టీగా టి.ఆర్.ఎస్ కు ప్రజల మద్ధతు గత పదేళ్లుగా ఒక రేంజ్ లో ఉండగా ఎప్పుడైతే టి.ఆర్.ఎస్ ని కాత బి.ఆర్.ఎస్ చేసి దేశ రాజకీయాల పైన గురి పెట్టారో అప్పుడే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా బి.ఆర్.ఎస్ ను ఓడించారు. ఇక అధికార పార్టీ పెట్టే ఇబ్బందులతో పాటుగా ఇచ్చే ఆఫర్లకు కొందరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి అధికార పార్టీ తీర్ధం పుచ్చుకునే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. సో ఈ ఐదేళ్లలో ఎంతమంది బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారో చూడాలి.

Author